ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డులకు ఓటింగ్ ప్రారంభమైంది. నేటి నుంచి మీకు ఇష్టమైన క్రికెటర్‌కు ఓటు వేయొచ్చు. నామినేట్ అయిన ఆటగాళ్లలో అత్యధిక ఓటింగ్ అందుకున్న క్రీడాకారులు విజేతలుగా నిలిచి.. పురస్కారాలు సొంతం చేసుకోనున్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ దశాబ్దపు ప్లేయర్ అవార్డుకు భారత్ నుంచి నామినేట్ అయ్యారు. అంతేగాక, గత పదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించిన కోహ్లీ మరికొన్ని ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపికయ్యాడు. దశాబ్దపు వన్డే ప్లేయర్ అవార్డుకు కోహ్లీతో పాటు భారత్ నుంచి మాజీ సారథి ఎంఎస్ ధోనీ, ఓపెనర్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యారు. అలాగే దశాబ్దపు టీ20 ప్లేయర్ అవార్డుకు రోహిత్, కోహ్లీ ఎంపికయ్యారు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు సిఫార్సు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ, ధోనీ ఉన్నారు.
నామినేట్ అయిన ఆటగాళ్లు..
- పురుషుల క్రికెట్‌లో దశాబ్దపు ఆటగాడు
కోహ్లీ (భారత్), అశ్విన్ (భారత్), జో రూట్ (ఇంగ్లాండ్), విలియమ్సన్ (న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర (శ్రీలంక)
- పురుషుల క్రికెట్‌లో దశాబ్దపు వన్డే ప్లేయర్
కోహ్లీ (భారత్), మలింగ (శ్రీలంక), మిచెల్ స్టార్క్ (ఆసీస్), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), రోహిత్ శర్మ (భారత్), ఎంఎస్ ధోనీ (భారత్), సంగక్కర (శ్రీలంక)
- పురుషుల క్రికెట్‌లో దశాబ్దపు టెస్టు ఆటగాడు
కోహ్లీ (భారత్), విలియమ్సన్ (కివీస్), స్మిత్ (ఆసీస్), అండర్సన్ (ఇంగ్లాండ్), హెరత్ (శ్రీలంక), యాసిర్ షా (పాక్)
- ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు
కోహ్లీ (భారత్), విలియమ్సన్ (కివీస్), మెక్‌కలమ్ (కివీస్), మిస్బా ఉల్ హక్ (పాక్), ధోనీ (భారత్), స్రుబోస్‌లే (ఇంగ్లాండ్), కేథారిన్ (ఇంగ్లాండ్), జయవర్ధెనె (శ్రీలంక), వెటోరి (కివీస్)
- మహిళా క్రికెట్‌లో దశాబ్దపు ప్లేయర్
ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), సుజీ బేట్స్ (కివీస్), స్టెఫనీ టేలర్ (వెస్టిండీస్), మిథాలీ రాజ్ (భారత్), సారా టేలర్ (ఇంగ్లాండ్)
-
🚨 The #ICCAwards are back 🚨
— ICC (@ICC) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
And this time, we need YOUR help to decide!
Which cricketers have impressed you in the last decade? 🏏
Vote now and you could win!
✈️ Flights
📱 Phones
🎟️ Tickets
🏏 Merchandise
Make your vote count ⬇️
">🚨 The #ICCAwards are back 🚨
— ICC (@ICC) November 25, 2020
And this time, we need YOUR help to decide!
Which cricketers have impressed you in the last decade? 🏏
Vote now and you could win!
✈️ Flights
📱 Phones
🎟️ Tickets
🏏 Merchandise
Make your vote count ⬇️🚨 The #ICCAwards are back 🚨
— ICC (@ICC) November 25, 2020
And this time, we need YOUR help to decide!
Which cricketers have impressed you in the last decade? 🏏
Vote now and you could win!
✈️ Flights
📱 Phones
🎟️ Tickets
🏏 Merchandise
Make your vote count ⬇️