ETV Bharat / sports

'ఆ రెండు విషయాల్లో స్మిత్ కంటే కోహ్లీనే గొప్ప' - స్మిత్ కంటే కోహ్లీనే గొప్ప

ఓ ఇంటర్వ్యూలో తాజాగా మాట్లాడిన ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్.. కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్​మన్, కెప్టెన్ అని అన్నారు. స్మిత్ అతడి తర్వాతనే అని పేర్కొన్నారు.

'ఆ రెండు విషయాల్లో స్మిత్ కంటే కోహ్లీనే గొప్ప'
టీమిండియా సారథి కోహ్లీ
author img

By

Published : May 1, 2020, 6:54 PM IST

క్రికెట్‌లో ఎప్పుడూ అత్యుత్తమ క్రికెటర్లపై చర్చ కొనసాగుతూనే ఉంటుంది. 1990-2000 సీజన్‌లో సచిన్‌, లారా మధ్య ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్‌ అనే చర్చ నడుస్తూ ఉండేది. ఇప్పుడు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ మధ్య ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ ఛాపెల్‌ ఓ వీడియోలో మాట్లాడుతూ విరాట్‌కే తన ఓటు వేశారు.

ian chappell
ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్

క్రికెట్‌ విశ్లేషకుడు‌ రౌనక్‌ కపూర్.., ఛాపెల్‌తో ఓ వీడియోలో సంభాషించారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ ర్యాపిడ్‌ ఫైర్‌ ఆడుతుండగా రౌనక్‌ ఓ ప్రశ్న వేశారు. కోహ్లీ, స్మిత్‌ మధ్య ఎవరు గొప్ప క్రికెటర్‌? అని ఛాపెల్‌ను అడిగారు. స్పందించిన ఆసీస్‌ మాజీ ప్లేయర్‌.. కెప్టెన్‌గా చెప్పమంటారా లేదా బ్యాట్స్‌మన్‌గా చెప్పమంటారా అని తిరిగి ప్రశ్నించారు. ప్రతిగా రౌనక్‌ మీరే చెప్పండని అన్నారు. అప్పుడు ఛాపెల్‌.. కోహ్లీని బెస్ట్‌ కెప్టెన్‌, బ్యాట్స్‌మన్‌గా పేర్కొన్నారు.

virat kohli
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

కోహ్లీ ఇప్పటికే వన్డేలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో రెండో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లోనూ టాప్‌ 10లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే 70 శతకాలు సాధించాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 కోహ్లీ సాధించిన సెంచరీలు. దీంతో కోహ్లీకే ఛాపెల్‌ ఓటేశారు. మరోవైపు ఆసీస్‌ మాజీ సారథి రికీపాంటింగ్‌.. స్టీవ్‌వా కన్నా అత్యుత్తమ కెప్టెన్‌ అని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.