ETV Bharat / sports

'రీఎంట్రీపై కచ్చితమైన నమ్మకాన్ని ఇవ్వలేను' - రీఎంట్రీపై డివిలియర్స్ స్పందన

వచ్చే టీ20 ప్రపంచకప్​లో ఆడతానా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని అంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. తాజాగా ఈ విషయంపై మాట్లాడాడు.

AB De Villiers
AB De Villiers
author img

By

Published : Apr 13, 2020, 7:09 PM IST

కొంతకాలంగా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. కోచ్​ బౌచర్.. ఏబీకి మద్దతుగా ఉండటం వల్ల త్వరలోనే డివిలియర్స్ మళ్లీ బ్యాట్ పడతాడని అంతా భావించారు. కానీ ఇటీవల బౌచర్​ మాట్లాడుతూ ఫామ్​లో ఉంటేనే అవకాశం కల్పిస్తామని అన్నాడు. ఈ మాటలు మిస్టర్ 360ని నొప్పించినట్టున్నాయి. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఏబీ ఫిట్​గా ఉంటేనే ఆడతానని అన్నాడు.

"ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే రీఎంట్రీపై ఆలోచన చేయాల్సిందే. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడైతే నేను ఫిట్​గా ఉన్నాను. కానీ వచ్చే ఏడాది ఇలానే ఉంటానని చెప్పలేను. ఇప్పుడే ఈ విషయంపై కచ్చితమైన నమ్మకాన్ని ఇవ్వలేను."

-డివిలియర్స్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

డివిలియర్స్‌ 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌ తరహా లీగ్​ల్లో మాత్రమే ఆడుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌కు అవసరమైతే అందుబాటులో ఉంటానని మిస్టర్‌ 360 చెప్పగా సెలక్టర్లు అందుకు అంగీకరించలేదు. అయితే టీ20 ప్రపంచకప్‌కు అతడిని ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు కూడా ఏబీ తిరిగి జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.