ETV Bharat / sports

'నన్ను టెర్రరిస్టు వార్డులో ఉంచి విచారణ చేశారు'​ - శ్రీశాంత్​ లేటెస్ట్​ న్యూస్​

మ్యాచ్​ ఫిక్సింగ్​ కేసులో భాగంగా తనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ టెర్రరిస్టు వార్డులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశాడు బౌలర్​ శ్రీశాంత్​. 12 రోజుల పాటు రోజుకు 16 నుంచి 17 గంటల విచారణ చాలా కష్టంగా అనిపించిందని వెల్లడించాడు.

'I was taken to terrorist ward': Sreesanth recalls his arrest in spot-fixing case
'నన్ను టెరరిస్టు వార్డులో ఉంచి.. విచారణ చేశారు'​
author img

By

Published : Jul 2, 2020, 1:07 PM IST

మ్యాచ్​ ఫిక్సింగ్​ కేసులో తనను పోలీసులు అదుపులోకి తీసుకున్న క్షణాలను గుర్తు చేసుకున్నాడు టీమ్​ఇండియా బౌలర్​ శ్రీశాంత్​. అరెస్టు చేసిన తర్వాత తనను ఓ టెర్రరిస్టు​ వార్డులో ఉంచారని తెలిపాడు. అదే తన జీవితంలో కీలక మలుపని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శ్రీశాంత్​.

"నా లైఫ్​లోకి ఒకసారి చూసినట్లైతే.. మ్యాచ్​ పార్టీ అయిపోయిన కొన్ని క్షణాల్లోనే నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం నన్ను ఓ టెర్రరిస్టు వార్డులో ఉంచారు. 12 రోజులపాటు రోజుకు 16-17 గంటలపాటు విచారణ సాగింది. ఆ సమయంలో నా కుటుంబసభ్యులు ఎలా ఉన్నారనే ఆలోచన నన్ను కలచివేసింది. కొన్ని రోజుల తర్వాత నా సోదరుడు నన్ను చూడటానికి వచ్చాడు. నా కుటుంబం క్షేమంగా ఉన్నట్లు నాకు అప్పుడే తెలిసింది. ఆ పరిణామాల నుంచి బయటకు రావడానికి కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారు. మరో విషయం ఏమిటంటే మనం చేసే ప్రతి యుద్ధం గెలవడం ఎంతో ముఖ్యం. ఎవరికి వారు తమ సొంత యుద్ధంలో పాత్రులై ఉంటారు. దిగ్గజ బ్యాట్స్​మన్​ సచిన్​ తెందూల్కర్​ ఒక మ్యాచ్​లో సెంచరీ చేసినా.. తర్వాతి మ్యాచ్​లో డకౌట్​ అయిన క్షణాలూ ఉన్నాయి. మీరేదైనా నిర్ణయం తీసుకునే ముందు 10 సెకన్లపాటు ఆలోచించండి. మీరు అనుకున్న దానిపై దృష్టి సారించండి. ప్రపంచం ఏమనుకుంటుందో అనే విషయం మరిచిపోండి."

- శ్రీశాంత్​, టీమ్​ఇండియా బౌలర్​​

బాలీవుడ్​ హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మరణంపై టీమ్​ఇండియా బౌలర్​ శ్రీశాంత్​ స్పందిస్తూ.."నేను శిక్షణలో ఉండగా నా భార్య ఓ సందేశాన్ని పంపింది. అ సమయంలో నేను దాన్ని చూడలేదు. తర్వాత కారులో వస్తుండగా.. నా భార్య ఓ వాయిస్​ మెయిల్​ చేసింది. ఆమె వేళాకోళం చేస్తుందని భావించా. అనంతరం ఆ వార్త నిజమో కాదో అంతర్జాలంలో చెక్​ చేశా. సోషల్​మీడియాలో సుశాంత్​కు సంబంధించిన అనేక ఫొటోలు వైరల్​ అయ్యాయి. ఆ రోజు నాకు చాలా బాధగా అనిపించింది" అని తెలిపాడు​.

ఇదీ చూడండి... వెస్టిండీస్​ దిగ్గజ క్రికెటర్​ ఎవర్టన్​​ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.