వచ్చే ఏడాది టీ- ట్వంటీ ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా యువ క్రికెటర్ల వైపే మొగ్గు చూపుతుంది సెలక్షన్ కమిటీ. ఈ లోపు వారికి 4 నుంచి 5 అవకాశాలు వస్తాయని, ఇది దృష్టిలో ఉంచుకుని వాళ్లను వాళ్లు నిరూపించుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
"టీ-20 వరల్డ్‌కప్ కంటే ముందు మేము దాదాపు 30 మ్యాచ్‌లు ఆడనున్నాం. ఇందులో అన్ని మ్యాచ్‌ల్లో అందరికీ అవకాశం రాకపోవచ్చు. అంతెందుకు నేనూ 15 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. ఇందులో స్పష్టత ఉంది. ఒక్కొక్కరికి 4 లేదా 5 అవకాశాలు వస్తాయి. దీన్ని వారు దృష్టిలో ఉంచుకుని ప్రదర్శన చేయాల్సి ఉంటుంది" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ .
టీ-20 ప్రంపచకప్తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్పైనా తాము దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పాడు కోహ్లీ.
"వచ్చే ఏడాది టీ-20 ప్రపంచకప్‌తో పాటు టెస్టు ఛాంపియన్‌షిప్‌కు మేము సన్నద్ధం కావాల్సి ఉంటుంది. జట్టును ముందుకు తీసుకెళ్లాలంటే ఈ లోపు యువ క్రికెటర్లు కుదురుకోవాలి" - విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ-20 సిరీస్‌లో ఎక్కువ మంది యువక్రికెటర్లనే ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ పర్యటనలోనూ రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ లాంటి ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.
ఇదీ చదవండి: ధర్మశాలలో వర్షం కారణంగా టాస్ ఆలస్యం