న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో పరిస్థితులు తారుమారయ్యాయని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం ఆడిన తొలి టీ20 నాటి పరిస్థితులు ఈరోజు లేవని, పిచ్ మారడం వల్ల లక్ష్యం కూడా మారిందని చెప్పాడు. కివీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా ఘనవిజయం సాధించింది. కేఎల్ రాహుల్(57; 50 బంతుల్లో 3x4, 2x6), శ్రేయస్ అయ్యర్(44; 33 బంతుల్లో 1x4, 3x6) జట్టుకు మరో విజయాన్ని అందించారు. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన రాహుల్ మాట్లాడుతూ తొలి టీ20లో ధాటిగా ఆడినట్టు ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయానన్నాడు.
"ఈ రోజు కచ్చితమైన మార్పులు కనిపించాయి. పిచ్ మారింది. లక్ష్యం చిన్నది అయిపోయింది. ఇవాళ రోహిత్ శర్మ(8), కెప్టెన్ విరాట్ కోహ్లీ(11) త్వరగా ఔటవ్వడం వల్ల నాపై బాధ్యత పెరిగింది. నేనేం చేయాలో తెలిసింది. తొలి మ్యాచ్‌లో ఆడినట్లు ఆడలేకపోయా. నేను నిలకడగా రాణించడానికి గల కారణం నాకు తెలీదు. ఎల్లప్పుడూ జట్టును ముందుకు తీసుకెళుతూ.. ఏం కావాలో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ రోజు చాలా మంచి షాట్లు ఆడగలిగా" అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
రాహుల్ రికార్డు
టీ20 క్రికెట్లో వికెట్ కీపర్‌గా ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనే రెండు అర్ధ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు రాహుల్.
ఇదీ చూడండి.. రెండోదీ మనదే.. మెరిసిన రాహుల్, శ్రేయస్