గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్ మైదానం వేదిక. అయితే బయట నుంచి వచ్చే ఒత్తిడిని దూరంగా ఉంచేందుకు తన సోషల్ మీడియా ఖాతాల్ని ఇప్పటికే డిలీట్ చేసినట్లు ఆసీస్ ప్రముఖ పేసర్ స్టార్క్ చెప్పాడు.
"టీమ్ఇండియాతో సిరీస్(2018-19) తర్వాత ట్విట్టర్ నుంచి బయటకొచ్చేశాను. సోషల్ మీడియాలోని విషయాల్ని పెద్దగా చదవడం మానేశాను. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం తగ్గించాను. చేసే పనిపై పూర్తిగా దృష్టి పెట్టడం, అనుకున్న విధంగా బౌలింగ్ చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. భారత్తో గత సిరీస్లో ఓటమి తర్వాత నన్ను నమ్మే వాళ్లతో మాత్రమే మాట్లాడుతున్నాను. మీడియాలో, బయట చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. వాటి గురించి ఆలోచించడం వృథా! అందుకే కేవలం నా ఆటపైనే దృష్టి సారించాలని అనుకుంటున్నాను"
-మిచెల్ స్టార్క్, ఆసీస్ స్టార్ పేసర్
గత సిరీస్లో 2-1 తేడాతో కోహ్లీసేన చేతిలో ఆసీస్ టెస్టు సిరీస్ ఓడింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకుంటామని స్టార్ అన్నాడు. 2019-20 సీజన్లో 45 వికెట్లు తీసిన ఈ బౌలర్.. ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కంగారూ బౌలింగ్ బృందాన్ని ముందుండి నడిపించనున్నాడు.