ETV Bharat / sports

'టీమ్​ఇండియా కోచ్​గా అలా ఎంపికయ్యా'

2007లో టీమ్​ఇండియా కోచ్​కు దరఖాస్తు చేయకపోయినా ఆ పదవి తనను ఎలా వరించిందో తాజాగా వెల్లడించాడు మాజీ కోచ్​ గ్యారీ కిర్​స్టన్​. గావస్కర్​ ఆహ్వానంతో తాను ఆ ఇంటర్వ్యూకు హాజరైనట్లు తెలిపాడు. గ్రెగ్​ చాపెల్​ కాంట్రాక్టు ముగిశాక కోచ్​ పదవి చేపట్టినట్లు చెప్పాడు.

'I don't have a vision': Kirsten recalls how he landed India coach's job in 7 minutes
'టీమ్​ఇండియా కోచ్​గా అలా ఎంపికయ్యా!'
author img

By

Published : Jun 15, 2020, 5:43 PM IST

టీమ్​ఇండియా కోచ్​కు దరఖాస్తు చేయకపోయినా 2007లో ఆ పదవి ఎలా వరించిందో తాజాగా వెల్లడించాడు మాజీ కోచ్​ గ్యారీ కిర్​స్టన్​. ఇటీవలే ఓ ఆడియో ఆధారిత ఇంటర్వ్యూలో పాల్గొన్న కిర్​స్టన్​ 2007కు సంబంధించిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకున్నాడు. అప్పటి భారత జట్టు సెలక్షన్​ ప్యానెల్​లో ఉన్న సునీల్ గావస్కర్ ఆహ్వానంతో తాను ఇంటర్వ్యూకు వెళ్లానని, గ్రెగ్​ చాపెల్​ కాంట్రాక్టు ముగిశాక తాను కోచ్​గా చేరినట్లు వెల్లడించాడు.

'I don't have a vision': Kirsten recalls how he landed India coach's job in 7 minutes
సునీల్​ గావస్కర్​

"భారత జట్టుకు నన్ను కోచ్​గా నియమిస్తానని గావస్కర్​ నుంచి మెయిల్ వచ్చింది. అది రూమర్​ అని అనుకుని దానికి సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత..'ఇంటర్వ్యూకు వస్తారా' అనే మరో మెయిల్​ వచ్చింది. దాన్ని నా భార్యకు చూపించగా..'అది తప్పుడు వ్యక్తి పనెమో' అని చెప్పింది. కానీ తర్వాత ఇంటర్వ్యూకు వెళ్లా. చాలా విషయాల్లో అదో విచిత్రమైన అనుభవంగా మిగిలిపోయింది. నన్ను అక్కడ చూసిన అనిల్​ కుంబ్లే..'ఇక్కడ ఏం చేస్తున్నావు' అని అడిగాడు. భారత జట్టుకు కోచ్​ కోసం జరుగుతున్న ఇంటర్వ్యూలో పాల్గొనడానికి వచ్చానని చెప్పా."

-గ్యారీ కిర్​స్టన్​, టీమ్​ఇండియా మాజీ కోచ్​

ప్రస్తుత కోచ్​ రవిశాస్త్రి.. సెలక్షన్​ ప్యానెల్​లో ఉన్నాడని తెలిపాడు కిర్​స్టన్. ఆ ఇంటర్వ్యూ ఏడు నిమిషాల పాటు చేశారని తెలిపాడు.

టీమ్​ఇండియాతో గ్యారీ క్రిస్టెన్​

"బీసీసీఐ అధికారులతో కలిసి బోర్డు మీటింగ్​లో ఉన్నా. పూర్తిగా భయానకమైన వాతావరణంగా అనిపించింది. బోర్డు సెక్రటరీ నాతో మాట్లాడుతూ..'భారత క్రికెట్​ భవితవ్యం కోసం మీరు తయారు చేసిన విజన్​ ఏంటో తెలియజేయగలరా?' అని ప్రశ్నించాడు. నా దగ్గర దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూకు ఎలా సంసిద్ధమవ్వాలో ఎవ్వరూ చెప్పలేదు. ఆ తర్వాత అప్పటి కమిటీలో ఉన్న రవిశాస్త్రి మాట్లాడుతూ..'దక్షిణాఫ్రికా జట్టు ఆటగాడిగా భారత జట్టుపై విజయం సాధించడానికి మీరు ఏం చేస్తారు?' అని అడిగాడు. ఆ ప్రశ్న నాకు తేలికగా అనిపించింది. మూడు నిమిషాల పాటు వివరించా. రవిశాస్త్రితో పాటు అందరూ ఆ సమాధానానికి ముగ్ధులయ్యారు. మొత్తం ఏడు నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగింది. తర్వాత బోర్డు కార్యదర్శి నాకు కాంట్రాక్టు ఇస్తున్నట్లు తెలిపారు."

-కిర్​స్టన్, టీమ్​ఇండియా మాజీ కోచ్

గ్రెగ్​ చాపెల్​ తర్వాత కోచ్​ పదవికి తాను ఎంపికైనట్లు తెలిపాడు గ్యారీ కిర్​స్టన్​. టీమ్​ఇండియాకు అత్యధిక విజయాలు అందించిన కోచ్​గా ఘనత సాధించాడీ మాజీ కోచ్. అతని పర్యవేక్షణలో 2009 టెస్టు ర్యాంకింగ్స్​లో భారత జట్టు టాప్​లో నిలిచింది భారత్. రెండు సంవత్సరాల తర్వాత ప్రపంచకప్​ టైటిల్​ను నెగ్గింది.

టీమ్​ఇండియా ప్రస్తుత కోచ్​ రవిశాస్త్రి

ఇదీ చూడండి... 'ఉత్తమ ఫ్రాంచైజీ అంటే చెన్నై సూపర్​ కింగ్స్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.