ETV Bharat / sports

'భజ్జీ ఔట్ చేశాడు.. టెక్నిక్​పై నమ్మకం పోయింది' - పాంటింగ్

హర్భజన్, రిక్కీ పాంటింగ్​ల జోడీపై అభిమానుల్లో అప్పట్లో విపరీతమైన ఆసక్తి ఉండేది. అయితే టెస్టుల్లో తనపై ప్రతిసారి భజ్జీనే ఆధిపత్యం చెలాయించేవాడని పాంటింగ్ చెప్పాడు.

I didn't trust my technique after I got out to Harbhajan Singh for the first time: Ricky Ponting
'నాపై ఎప్పుడూ భజ్జీదే పైచేయి'
author img

By

Published : Dec 22, 2020, 3:01 PM IST

స్పిన్నర్ హర్భజన్ సింగ్​ చేతిలో తొలిసారి ఔటయ్యాక తన టెక్నిక్​పై విశ్వాసం కోల్పోయానని ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్​మన్ పాంటింగ్ చెప్పాడు. భారత స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​ 'డీఆర్​ఎస్ విత్ అశ్' యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. గ్రేమ్​స్మిత్​, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్​​లలో ఎవరితో ఆసక్తికరంగా ఉండేది అన్న ప్రశ్నకు.. భారత దిగ్గజ స్పిన్నర్ భజ్జీ అని పాంటింగ్ బదులిచ్చాడు.

"భజ్జీతో ఆడటం బాగుండేది. దాదాపు అన్నిసార్లు తన స్పిన్​ మాయాజాలంతో నన్ను బోల్తా కొట్టించేవాడు. టెస్టుల్లో అందరి కన్నా ఎక్కువసార్లు నన్ను ఔట్ చేసింది అతడే. భజ్జీని ఎదుర్కోవడానికి ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. భారత్​తో 2001లో జరిగిన టెస్టు సిరీస్​లో క్రీజులోకి వచ్చిన ప్రతిసారి హర్భజన్​ చేతిలోనే ఔటయ్యాను. అప్పటినుంచి నా టెక్నిక్​ను నమ్మడం మానేశా"

---- రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్

తాను విఫలమవడానికి, స్పిన్​ను ఆడలేకపోవడానికి సన్నద్ధత లేకపోవడమే కారణమని పాంటింగ్​ చెప్పాడు​. ఆసీస్ పిచ్​లపై వికెట్ల కోసం స్పిన్నర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేదని, అందువల్ల స్పిన్ ఆడాలంటే భయపడేవాడ్ని కాదని తెలిపాడు. పాంటింగ్​ను ఇప్పటివరకు భజ్జీ పదిసార్లు ఔట్ చేశాడు. ముంబయిలోనే ఐదుసార్లు పాంటింగ్ ఔటయ్యాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ రైనా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.