ETV Bharat / sports

ఇలానే ఆడతా.. అంతకుమించి కష్టం: పుజారా - మూడో టెస్టులో పుజారా పంత్​

ఆసీస్​తో మూడో టెస్టులో తన ఆటతీరుపై వస్తున్న విమర్శలను ఖండించాడు భారత బ్యాట్స్​మన్​ పుజారా. ఇంకా వేగంగా ఆడటం తనవల్ల కాదని తెలిపాడు. నాలుగో రోజు ఆటలో తమ జట్టు తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

pujara
పుజారా
author img

By

Published : Jan 9, 2021, 6:19 PM IST

Updated : Jan 9, 2021, 9:51 PM IST

పుజారా

సిడ్నీలో ఆసీస్​తో జరుగుతోన్న మూడో టెస్టులో పుజారా నెమ్మదిగా బ్యాటింగ్​ చేశాడు. దీంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన పుజారా.. ఇంకా వేగంగా ఆడటం తనవల్ల కాదని అన్నాడు. అయితే ఆసీస్​ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసించాడు.

"బ్యాటింగ్​ బాగానే చేశాను. ఇంకా మెరుగ్గా ఆడటం నాకైతే తెలియదు. తెలిసినట్లుగానే బ్యాటింగ్​ చేస్తాను. ప్రత్యర్థి జట్టు మంచి బంతులు వేశారు. దాన్ని అంగీకరించాలి. వారు మంచి లైన్​ అండ్​ లెంగ్త్​ బౌలింగ్​ వేశారు. పిచ్​పై సరైన అవగాహన ఉన్న వారి బౌలింగ్​ విధానానికి ప్రశంసించాల్సిందే. ఆసీస్​ జట్టు ఫాస్ట్​ బౌలింగ్​తో పోలిస్తే మా జట్టుకు కాస్త అనుభవం తక్కువ. కానీ రోజురోజుకు మేం మెరుగు పడుతున్నాం. మా బౌలర్లు ఇంకా బాగా బంతులు విసిరడానికి ఇది మంచి అవకాశం. కమిన్స్​ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. నేను బాగా ఆడలేదని అని అనుకోవట్లేదు. సమయం అనుకూలించనప్పుడు ఎవ్వరూ ఏమి చేయలేరు. ఈ టెస్టుకు ముందు నెట్​ ప్రాక్టీస్​ చేస్తున్నప్పుడు నాకు తగిలిన గాయం వల్లే సరిగ్గా ఆడలేకపోయానని అంటున్నారు. ఇది ఏ మాత్రం నిజం కాదు. పూర్తిగా కోలుకున్నానా లేదా అనేది చెప్పలేను"

-పుజారా, టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో పంత్​(36) ఔట్​ కాగానే మ్యాచ్ గతి మారిపోయిందని పుజారా అన్నాడు. తొలి సెషన్​లో జడేజా త్వరగా ఔట్​ అవ్వడం వల్ల తమకు గట్టి దెబ్బ తగిలినట్లైందని చెప్పాడు.

"పంత్​ ఔట్​ అవ్వడం వల్ల మా జట్టు కష్టాల్లోకి వెళ్లిపోయింది. అప్పటివరకు అంతా బాగానే ఉంది. 180 పరుగులకు నాలుగు వికెట్లు పోయినా సరే బాగానే ఆడుతున్నాం. కానీ పంత్​ వెనుదిరిగిపోవడం వల్ల మ్యాచ్ పరిస్థితి తారుమారైంది. రహానెను కూడా తొలి సెషన్​లో త్వరగా ఔట్​ అవ్వడం వల్ల గట్టి దెబ్బ తగిలినట్లైంది. ఈ పోరులో జడేజాకు తగిలిన గాయం వల్ల రెండో ఇన్నింగ్స్​ అతడు ఆడలేకపోవచ్చు. అది మాకు పెద్ద ఎదురుదెబ్బే. ఓ గొప్ప బౌలర్​ను మేం కోల్పోయాం. దీనివల్ల మిగతా బౌలర్లపై భారం పడుతుంది. అతడు ఉంటే ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​పై ఒత్తిడి తీసుకొస్తాడు. జడేజా గొప్ప బౌలర్ మాత్రమే కాదు మంచి ఫీల్డర్​ కూడా. ఏదేమైనప్పటికీ నాలుగో రోజు ఆటలో మా జట్టు తిరిగి పంజుకుంటుంది"

-పుజారా, టీమ్​ఇండియా క్రికెటర్​

ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మూడో రోజు పూర్తయ్యేసరికి రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి, 197 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చూడండి : పుజారా నెమ్మదిగా బ్యాటింగ్.. మాజీల విమర్శలు

Last Updated : Jan 9, 2021, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.