ETV Bharat / sports

ఫ్లింటాఫ్​ నా నాలుక కోస్తా అన్నాడు: యువీ

2007 టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ క్రికెటర్ ఫ్లింటాఫ్​తో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవకు సంబంధించిన విషయాల్ని తాజాగా పంచుకున్నాడు యువీ.

యువరాజ్
యువరాజ్
author img

By

Published : May 18, 2020, 12:10 PM IST

2007 టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో యువరాజ్ సిక్సుల జోరు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ మ్యాచ్​లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో యువీ బాదిన ఆరు సిక్సులు ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. అయితే ఈ సిక్సుల వరద ముందు ఆ జట్టు ఆటగాడు ఫ్లింటాఫ్​తో వాగ్వాదం జరిగింది. తాజాగా ఆ గొడవ గురించి చెప్పుకొచ్చాడు యువీ.

"ఫ్రెడ్డీ(ఫ్లింటాఫ్‌) వరుసగా రెండు మంచి బంతులు వేశాడు. ఆ తర్వాత వేసిన యార్కర్​ను బౌండరీ పంపించా. అప్పుడు అతను నా దగ్గరకు వచ్చి అవి డాష్‌ షాట్స్‌ అని అవహేళనగా మాట్లాడాడు. 'నేను నీ గొంతు కోస్తా' అన్నాడు. అపుడు నేను 'నా చేతిలో బ్యాట్‌ చూశావా. ఈ బ్యాట్‌తో నిన్ను ఎక్కడ కొడతానో తెలుసా?. అన్నాను. అపుడు నేను చాలా కోపంగా ఉన్నా. తర్వాత ఓవర్‌లోనే నేను బ్రాడ్‌ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదా. సిక్సర్ల తర్వాత దిమిత్‌ మస్కరెనాస్‌ వైపు చూసి, అప్పుడు ఫ్లింటాఫ్‌ వైపూ చూశా. దిమిత్​ను ముందుగా చూడటానికి కారణం అతడు ఓ వన్డే మ్యాచ్​లో నా బౌలింగ్​లో ఐదు సిక్సులు కొట్టడమే. "

-యువరాజ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

20007 టీ20 ప్రపంచకప్​ను ధోనీ నేతృత్వంలోని భారత్‌‌ సాధించడంలో యువరాజ్‌ కీలక పాత్ర పోషించాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లోనూ యువీ తనదైన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్​గా నిలిచాడు. మొత్తంగా యువరాజ్‌ తన కెరీర్‌లో 304 వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20లు, 40 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.