ETV Bharat / sports

రోహిత్​ ప్రదర్శనపై పూర్తి నమ్మకముంది: హస్సీ

భారత స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ.. ఆస్ట్రేలియాలో జరగబోయే టెస్టు సిరీస్​లో మంచి ప్రదర్శన చేస్తాడని అభిప్రాయపడ్డాడు ఆసీస్ మాజీ క్రికెటర్ హస్సీ. ఈ విషయంలో తనకెలాంటి సందేహం లేదని అన్నాడు.

Hussey feels Rohit has 'ability & temperament' to excel in Australian conditions
రోహిత్​ ప్రదర్శనపై నాకు నమ్మకముంది: హస్సీ
author img

By

Published : Jul 1, 2020, 10:50 AM IST

ఆస్ట్రేలియాలోని పిచ్​ పరిస్థితులు ప్రపంచంలో ఎలాంటి బ్యాట్స్​మెన్​నైనా పరీక్షించే విధంగా ఉంటాయని అన్నాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ మైకేల్​ హస్సీ. కానీ భారత స్టార్ ఓపెనర్ రోహిత్​శర్మలోని సామర్థ్యం, స్వభావంపై తనకెలాంటి సందేహం లేదని చెప్పాడు. హిట్​మ్యాన్​కు భవిష్యత్​లో అగ్రస్థానానికి వెళ్లే నైపుణ్యాలున్నాయని అభిప్రాయపడ్డాడు.

Hussey feels Rohit has 'ability & temperament' to excel in Australian conditions
మైక్​ హస్సీ

"రోహిత్​శర్మ టాప్​ఆర్డర్​ బ్యాట్స్​మన్​గా వన్డే క్రికెట్లో బాగా రాణిస్తున్నాడు. టెస్టుల్లో కొంతమేర సక్సెస్ అయ్యాడు. అతడి బ్యాటింగ్ నైపుణ్యం, సామర్థ్యం, స్వభావంపై నాకు ఎలాంటి సందేహాలు లేవు. ఆస్ట్రేలియాలోని పరిస్థితులను రోహిత్​ స్వీకరించగలడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ మైదానాల్లో పేస్​, బౌన్సర్లు వేగంగా వస్తాయి. వాటిని తట్టుకుని నిలిచే శక్తి అతడికి ఉందని భావిస్తున్నా"

- మైకేల్ హస్సీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఈ ఏడాది డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది భారత్. అయితే టెస్టు సిరీస్(బోర్డర్​-గావస్కర్)​​ ఆసీస్​ ఆటగాళ్లు స్టీవ్​ స్మిత్​, డేవిడ్​ వార్నర్​లకు కష్టంగా ఉంటుందని హస్సీ భావిస్తున్నాడు. బాల్​ టాంపరింగ్​ నిషేధంతో 2018లో భారత్​ చారిత్రక విజయాన్ని అందుకున్న టెస్టు సిరీస్​లో వీరిద్దరూ ఆడలేదు. ఆ నిషేధం తర్వాత టీమ్​ఇండియాతో స్మిత్​, వార్నర్​లు ఆడుతున్న టెస్టు సిరీస్​ ఇదే. దీనితోపాటే ధోనీ రిటైర్మెంట్​పైనా స్పందించాడు హస్సీ. మహీకి మరో పదేళ్లు ఆడతాడని అనుకుంటున్నట్లు తెలిపాడు.

ఇదీ చూడండి... ధోనీకి​ నచ్చకలేదు.. కోహ్లీ దానికి వీరాభిమాని!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.