టీమ్ఇండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ యూవీ కెరీర్లోనే ఓ మైలురాయి. అందులో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో ఆకలితో ఉన్న సింహంలా విరుచుకుపడ్డాడు. ఆ రోజు యూవీ ప్రదర్శన భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈ అరుదైన ఘనతకు నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా యువరాజ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. తన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇంత త్వరగా సమయం ఎలా గడిచిపోయిందో తెలియడం లేదంటూ రాసుకొచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ 16 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 12 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 200/6 పరుగులు చేసి ఓటమిపాలైంది.
గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన యూవీ ప్రస్తుతం దేశీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">