ETV Bharat / sports

'పంత్​.. నీకు ధోనీతో పోలిక ఎందుకు?'

భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, ధోనీ లాంటి వ్యక్తితో పోల్చుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు ఎమ్​ఎస్​కే ప్రసాద్. ఆ ఆలోచన నుంచి పంత్​ బయటకు రావాలని సూచించారు.

How MS Dhoni comparisons worked against Rishabh Pant: Former chief selector MSK Prasad explains
'పంత్​.. నీకు ధోనీతో పోలిక ఎందుకు?'
author img

By

Published : Sep 9, 2020, 1:26 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​​ ధోనీతో తనను పోల్చుకోవడం యువ క్రికెటర్​ రిషభ్ పంత్​ మానుకోవాలని మాజీ సెలక్టర్​ ఎమ్​ఎస్​కే ప్రసాద్​ సూచించారు. తనకున్న అద్భుతమైన ప్రతిభతో రాణించగల సత్తా పంత్​లో ఉందని అన్నారు.

"రిషబ్​ పంత్​ను ప్రతిసారీ​ ధోనీతో పోల్చుతున్నారు. బహుశా అతడూ అదే ఆనందంలో ఉన్నాడు. ఆ ఆలోచన నుంచి బయటకు రావాలని మేం చాలాసార్లు సూచించాం. మహీది పూర్తిగా భిన్న వ్యక్తిత్వం.. అతడితో పోలిస్తే పంత్​ కూడా అసాధారణమైన ఆటగాడే. ఇతడిలోనూ ప్రతిభ ఉంది. అందుకే పంత్​కు మద్దతు ఇస్తున్నాం. అయినా ఇప్పటికీ ధోనీతో పోల్చుకోవడం సరైనది కాదు. అదృష్టవశాత్తూ మహీ ఇప్పుడు రిటైర్​ అయ్యాడు. ఇప్పుడైనా పంత్​ అతడితో పోల్చుకోవడం మానేసి ఆటపై నిలకడ అందుకుంటాడని భావిస్తున్నాను"

- ఎమ్​ఎస్​కే ప్రసాద్​, టీమ్​ఇండియా మాజీ సెలెక్టర్​

పంత్​ తన ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదుగుతాడని ఎమ్​ఎస్​కే ప్రసాద్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​లతో జరిగిన టెస్టు సిరీస్​ల​లో సెంచరీ సాధించిన తొలి వికెట్​ కీపర్​-బ్యాట్స్​మన్​గా రిషబ్​ పంత్​ ఘనత సాధించాడని ప్రశంసించారు. దీనిని బట్టి చూస్తే రిషభ్ సొంతంగా జట్టులో ఎదగగలడని తెలిపారు​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.