భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ సెంచరీ కోసం నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనైనా కోహ్లీ శతకాన్ని చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. 56 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద విరాట్ వెనుదిరిగాడు.
భారత్ స్కోరు 64 వద్ద క్రీజులోకి వచ్చిన విరాట్ మంచి టచ్‌లో కనిపించాడు. అదే ఊపు మీద అర్ధ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ.. ఈసారి సెంచరీ చేస్తాడన్న ఆశలు కలిగించాడు. 60 బంతుల్లో 56 పరుగులు చేసిన విరాట్.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
కోహ్లీ టెస్టుల్లో తన చివరి శతకాన్ని 2019 నవంబర్ 23న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాపై డేనైట్ మ్యాచ్‌లో చేశాడు. ఇది జరిగి ఒక సంవత్సరం మీద 123 రోజులు గడిచింది. అదే వన్డేల్లో 2019 ఆగస్టు 11న వెస్టిండీస్‌పై చేశాడు. ఇది జరిగి ఒక సంవత్సరం మీద 223 రోజులు గడిచింది. కోహ్లీ కెరీర్లో సెంచరీల మధ్య ఇన్ని రోజుల వ్యవధి ఎప్పుడూ లేదు.
ఇదీ చదవండి: కోహ్లీ ఒక్క సెంచరీతో.. రికార్డుల మోతే!