లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లోని కొలంబో కింగ్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ హెర్షల్ గిబ్ల్ ఎంపికయ్యాడు. అయితే ఈ టోర్నీలో వ్యాఖ్యాతగా విధులు నిర్వర్తించడానికి శ్రీలంక చేరుకున్న గిబ్స్కు కోచ్‌గా నియామాకం కావడం విశేషం.
పాత కోచ్‌కు కరోనా
కొలంబో కింగ్స్ ప్రధానకోచ్‌గా డేవ్ వాట్‌మోర్‌ను నియమించారు. వ్యక్తిగత కారణాలతో లీగు నుంచి అతడు వైదొలగిన తర్వాత ఆ స్థానంలో కబీర్ అలీను ఎంపిక చేశారు. ఇప్పుడు కబీర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆ జట్టు యాజమాన్యం గిబ్స్‌ను కోచ్‌గా నియమించుకుంది. సహాయ కోచ్‌గా రంగన హెరాత్ వ్యవహరించనున్నాడు.
గిబ్స్ కెరీర్
వన్డేల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మన్ గిబ్స్.. తన అంతర్జాతీయ క్రికెట్లో 90 టెస్టులు, 248 వన్డేలు, 23 టీ20లు దక్షిణాఫ్రికా తరపున ప్రాతనిధ్యం వహించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 14 సెంచరీలు సహా 6,167 పరుగులు చేశాడు. వన్డేల్లో 8,094 పరుగులు సాధించాడు.
లంక ప్రీమియర్ లీగ్.. ఈ ఏడాది నవంబరు 26 నుంచి డిసెంబరు 16 వరకు జరగనుంది. ఇందులో ఆండ్రీ రసెల్, షాహిద్ అఫ్రిది, ఇర్ఫాన్ పఠాన్ లాంటి ప్రముఖ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.