ETV Bharat / sports

వరల్డ్​కప్​ సూపర్​ లీగ్​లో 7వ స్థానానికి భారత్ - టీమ్​ఇండియా

ఐసీసీ నూతనంగా ప్రవేశపెట్టిన వరల్డ్​కప్​ సూపర్​ లీగ్​లో టీమ్​ఇండియా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్​లాడిన భారత్​.. 29 పాయింట్లతో లిస్టులో 7వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Here's how the ICC Cricket World Cup Super League Points Table looks like after India vs England series
వరల్డ్​కప్​ సూపర్​ లీగ్​లో 7వ స్థానానికి భారత్
author img

By

Published : Mar 30, 2021, 7:21 AM IST

ఐసీసీ క్రికెట్​ వరల్డ్​కప్ సూపర్ లీగ్​ పాయింట్ల పట్టికలో భారత్​ 7వ స్థానానికి చేరుకుంది. సొంతగడ్డపై 2-1 తేడాతో ఇంగ్లాండ్​పై సిరీస్ విజయం సాధించిన టీమ్​ఇండియా తాజా ర్యాకింగ్స్​లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్​లాడిన కోహ్లీసేన.. 3 విజయాలు, 3 ఓటములతో 29 పాయింట్లు సాధించింది.

ఇప్పటివరకు 9 మ్యాచ్​లాడిన ఇంగ్లాండ్.. 4 మ్యాచ్​ల్లో నెగ్గగా, మిగిలిన వాటిలో పరాజయం పాలైంది. మొత్తంగా 40 పాయింట్లు సాధించి ఈ లిస్టులో తొలి స్థానంలో ఉంది. 6 మ్యాచ్​ల్లో నాలుగింటిని గెలిచిన ఆసీస్​ 40 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. నెట్​ రన్​రేట్​ ఆధారంగా ఇంగ్లాండ్​ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ఆడిన 3 మ్యాచ్​ల్లోనూ విజయం సాధించి 30 పాయింట్లతో కివీస్, అఫ్గానిస్తాన్.. 3, 4 స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా, లంక జట్లు ఇంకా బోణీ కొట్టలేదు.

ICC Cricket World Cup Super League Points
వరల్డ్​కప్​ సూపర్ లీగ్ పాయింట్ల పట్టిక

వరల్డ్​కప్ సూపర్​ లీగ్​ అంటే..

అంతర్జాతీయ క్రికెట్ మండలి దీనిని తొలిసారిగా ప్రవేశపెట్టింది. 2023లో జరగబోయే ప్రపంచకప్ దృష్ట్యా ఈ జాబితాను తయారు చేశారు. ఈ లిస్టులో తొలి 8 స్థానాలలో నిలిచిన జట్లు వరల్డ్​కప్​కు నేరుగా అర్హత సాధిస్తాయి. 2020 జులై నుంచి 2023 మార్చి వరకు కాలపరిధిగా నిర్ణయించారు.

ఇందులో ప్రతి జట్టు 24 వన్డేలు ఆడుతుంది. ​మ్యాచ్​ గెలిచిన జట్టుకు 10 పాయింట్లు, టై/ఫలితం తేలనివి/రద్దైన మ్యాచ్​లకు ప్రతి జట్టుకు 5 పాయింట్లు కేటాయిస్తారు. ఓడిపోయిన టీమ్​కు పాయింట్లేమీ ఉండవు.

ఇదీ చదవండి: 'ధోనీ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.