ETV Bharat / sports

భజ్జీని ఇబ్బందిపెట్టిన బ్యాట్స్​మెన్​ వీరే!

తనను బాగా ఇబ్బందిపెట్టిన బ్యాట్స్​మెన్ గురించి చెప్పుకొచ్చాడు టీమ్​ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్​. తన బౌలింగ్​లో వారు పూర్తి ఆధిపత్యం వహించేవారని తెలిపాడు.

భజ్జీ
భజ్జీ
author img

By

Published : Apr 25, 2020, 12:08 PM IST

టీమ్‌ఇండియాలో హర్భజన్‌సింగ్‌ ఎంతటి ప్రతిభావంతమైన స్పిన్నరో అందరికీ తెలిసిందే. తన బౌలింగ్‌తో ఎందరో దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను ఔట్‌చేసి జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించాడు. అలాంటి బౌలర్‌ కూడా పలువురు బ్యాట్స్‌మన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డానని చెప్పాడు. వారెవరో మీరూ చూసేయండి.

జాక్వెస్‌ కలిస్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ తనపై ఆధిపత్యం చెలాయించేవాడని భజ్జీ గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో తనపై మంచి పరుగులు రాబట్టేవాడని చెప్పాడు.

మాథ్యూ హెడెన్‌: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హెడెన్‌ ప్రపంచవ్యాప్తంగా స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేవాడని, తన బౌలింగ్‌లో కూడా చితకొట్టేవాడని తెలిపాడు.

బ్రియన్‌ లారా: వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారాతో భజ్జీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోయినా అతడికి బౌలింగ్‌ చేయడం కష్టంగా అనిపించేదని చెప్పాడు. అతడో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని కీర్తించాడు.

యూనిస్‌ఖాన్‌: పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ యూనిస్‌ ఖాన్‌ తనని చాలా ఇబ్బంది పెట్టాడని భజ్జీ స్పష్టం చేశాడు. తరచూ తన బౌలింగ్‌లో స్వీప్ ‌షాట్లు ఆడేవాడన్నాడు. ప్రతిసారి యూనిస్‌ తనని ఏడిపించేలా చేసేవాడని గుర్తుచేసుకున్నాడు.

ఇంజిమామ్‌-ఉల్‌-హక్‌‌: పాక్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ కూడా తనని టార్గెట్‌ చేసేవాడని చెప్పాడు. అతడిని కూడా ఔట్‌ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డానని తెలిపాడు. తనని ఇబ్బంది పెట్టిన వాళ్లలో ఇంకా చాలా మంది ఉన్నారని, అయితే.. ఈ ఐదుగురినే టాప్-5గా పేర్కొంటానంటూ భజ్జీ సెలవిచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.