టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ ఆటతీరు తొలినాళ్లలో పాకిస్థానీ బ్యాటింగ్ లెజెండ్ ఇంజమామ్-ఉల్-హక్‌ను పోలి ఉండేదని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఓ యూట్యూబ్ చాట్ సెషన్లో పాల్గొన్న యువీ.. రోహిత్ గురించి అడిగిన ప్రశ్నలకు స్పందించాడు.
"రోహిత్ భారత జట్టులోకి వచ్చినప్పుడు, అతడు సుదీర్ఘ కాలంగా కొనసాగుతాడని అనిపించింది. తొలినాళ్లలో అతడి ఆటతీరు పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్‌ను తలపించింది. బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేయగల నేర్పు అతడిలో ఉంది."
- యువరాజ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
రోహిత్ శర్మ.. 2007లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే ద్వారా టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు.. కానీ, ఆ మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం లభించలేదు.
ఇంజమామ్-ఉల్-హక్.. పాకిస్థాన్ జట్టు కష్ట సమయంలో 120 టెస్టులతో పాటు 300 వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2003-07 వరకు ఆ దేశ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
ఇదీ చూడండి.. కరోనాపై పోరాటంలో మద్దతుగా ప్రముఖుల విరాళాలు