ETV Bharat / sports

అతడో తెలివైన స్పిన్నర్: షోయబ్

టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్ ఎంతో తెలివైన బౌలర్‌ అని పాకిస్థాన్ దిగ్గజ పేసర్‌ షోయబ్‌ అక్తర్ కొనియాడాడు. అతడో పరిపూర్ణ లెగ్​ స్పిన్నర్​ అని ప్రశంసించాడు.

అక్తర్
అక్తర్
author img

By

Published : Feb 15, 2020, 9:05 PM IST

Updated : Mar 1, 2020, 11:32 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మంచి ప్రదర్శన చేశాడు. మిడిల్ ఓవర్లలో బ్యాట్స్​మెన్​ను తికమకపెట్టి వికెట్లు సాధించాడు. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాకిస్థాన్​ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చాహల్ బౌలింగ్​పై ప్రశంసల జల్లు కురిపించాడు.

"రవీంద్ర జడేజా అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్నాడు. కుల్దీప్ యాదవ్‌ సత్తా చాటలేకపోతున్నాడు. కానీ చాహల్‌ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. అతడిని తుదిజట్టు నుంచి తప్పించకూడదు. బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టే కొన్ని ట్రిక్స్‌ అతడికి తెలుసు. అతడు పరిపూర్ణ లెగ్‌ స్పిన్నర్‌. బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించగలడు. అతడు ఎంతో తెలివైనవాడు. కుల్దీప్ స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. అతడు గేమ్‌లో ఉండట్లేదు. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. మిడిల్‌ ఓవర్లలో చాహల్‌ మినహా ఎవరూ వికెట్లను తీయలేకపోతున్నారు."

-షోయబ్ అక్తర్‌, పాక్ పేసర్

గతంలో చాహల్, కుల్దీప్ కలిసి ఎంతో నిలకడగా రాణించారు. 34 వన్డేల్లో వీరిద్దరు కలిసి 65 వికెట్లు పడగొట్టారు. అంతేకాక 10 టీ20ల్లో 22 వికెట్లు సాధించి రికార్డు కూడా సృష్టించారు. కానీ ఇటీవల వీరిద్దరూ కలిసి బరిలోకి దిగలేకపోతున్నారు. ఇద్దరిలో ఒకరికి అవకాశం వస్తే మరొకరు బెంచ్‌కే పరిమితమవుతున్నారు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్,కివీస్ తొలి మ్యాచ్‌ ఫిబ్రవరి 21న ప్రారంభం కానుంది.

Last Updated : Mar 1, 2020, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.