ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ మయాంతి లాంగర్ ఓ ఆకతాయి నెటిజన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. భారత క్రికెటర్ స్టువర్ బిన్నీ భార్య మయాంతి.. క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ప్రస్తుతం ఆమె స్టార్‌స్పోర్ట్స్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది.
సోషల్ మీడియాలో ఆకతాయి నెటిజన్ల నుంచి ఆమెకి ఎప్పుడూ తలనొప్పే ఎదురవుతుంటుంది. తనని, బిన్నీని కొందరు నెటిజన్లు తరచూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. మయాంతి.. తన మాటల బాణాలతో వారికి బుద్ధి చెబుతుంటోంది. తాజాగా బిన్నీ పేరుతో తనని ట్రోల్ చేసిన నెటిజన్‌కు ఆమె మరోసారి అదిరిపోయే సమాధానమిచ్చింది.
తెలియని వారిపై కామెంట్లు చేయడు..
మా స్టూడియోలో రంగురంగుల జీవితం అంటూ తన ఫొటోని జత చేస్తూ మయాంతి ట్వీట్ చేసింది. దీనికి ఓ నెటిజన్ 'స్టువర్ట్ బిన్నీ ఎక్కడ ఉన్నాడు?' అని కామెంట్ చేయగా.. మరో ఆకతాయి నెటిజన్ 'బ్యాగులను మోస్తూ మయాంతికి సేవలందిస్తున్నాడు' అని బదులిచ్చాడు. అయితే దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది. "ధన్యవాదాలు, నా బ్యాగుని నేను మోసుకోగలను. అతడు తన జీవితాన్ని ఆస్వాదిస్తూ బిజీగా ఉన్నాడు. క్రికెట్ ఆడుతూ అద్భుతంగా గడుపుతున్నాడు. అతడికి తెలియని వారిపై అతడు చెత్త కామెంట్లు చేయడు" అని బదులిచ్చింది. ఆకతాయి నెటిజన్ నోరు మూయించేలా మంచి సమాధానమిచ్చారని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆమెకి క్రికెట్‌పై ఉన్న జ్ఞానం, సమయస్ఫూర్తి అందర్ని ఆకర్షిస్తాయి. ఐపీఎల్, క్రికెట్ ప్రపంచకప్‌లలో ఆమె వాక్పటిమతో అభిమానులకు ఎంతో దగ్గరైంది.
ఇదీ చూడండి.. రివ్యూ: రొటీన్ కథలో థ్రిల్లింగ్ అనుభవం 'మలంగ్'