టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ, టెస్టుల్లోనూ ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. రానున్న రోజుల్లో సెహ్వాగ్‌లా ప్రభావం చూపిస్తాడని అన్నాడు. స్టార్‌స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్టడ్' షోలో మాట్లాడుతూ హిట్‌మ్యాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు పఠాన్.
"వన్డేల్లో ఇప్పటికే రోహిత్ ద్విశతకాన్ని చూశాం. త్వరలో టెస్టుల్లోనూ చూసే అవకాశముంది. ఫిట్‌గా ఉండి రానున్న రోజుల్లో మరిన్ని మ్యాచ్‌లు ఆడుతాడు. వీరేందర్ సెహ్వాగ్‌లా ఈ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తాడు. గత రెండేళ్లలో రోహిత్లో మరో కోణాన్ని మనం చూశాం. సెంచరీ తర్వాత సెంచరీ చేస్తూనే ఉన్నాడు. ఇదే అతడి ఆటకు సహాయపడుతుందని అనుకుంటున్నాను"
-ఇర్ఫాన్ పఠాన్, మాజీ ఆల్‌రౌండర్
2013లో టెస్టుల్లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కెరీర్ ప్రారంభించిన రోహిత్.. గతేడాది ఓపెనర్‌గా మారి, తొలి మ్యాచ్‌లోనే రెండు శతకాలు చేసి రికార్డు సృష్టించాడు. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే 529 పరుగులు చేశాడు. 2019 ప్రపంచకప్‌లోనూ ఐదు సెంచరీలు చేసిన రోహిత్.. టోర్నీలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వన్డేల్లో అదరగొడుతున్న హిట్‌మ్యాన్.. టెస్టుల్లోనూ ఉన్నత శిఖరాలను చేరుకుంటాడని ఇర్పాన్ తెలిపాడు.