యూఏఈలో సెప్టెంబరు 19న ప్రారంభంకానున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు క్రికెటర్లందరూ శారీరకంగా, మానసికంగా సన్నద్ధమవుతున్నారు. ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి సారిస్తున్నారు. ప్రాక్టీసు చేస్తున్నారు. తాజాగా టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. ఈ మెగాటోర్నీలో తన సత్తా చాటేందుకు సాధన ప్రారంభించాడు. ఇందుకోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు. తాను కసరత్తు చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఒంటి కాలుపై కఠినమైన వ్యాయామం చేస్తూ చమటోడుస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
2015 నుంచి ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు హార్దిక్ పాండ్య. ఇటీవల అతడికి ఓ కుమారుడు జన్మించాడు.
ఐపీఎల్ కెరీర్లో 66 మ్యాచులు, 1,068 పరుగులు చేశాడు. చివరిసారిగా బెంగుళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా తరఫున ఆడాడు హార్దిక్.
ఇది చూడండి వారసుడి తొలి ఫొటోను పోస్ట్ చేసిన పాండ్య