క్రిస్ గేల్ కంటే డేవిడ్ వార్నర్‌కు బౌలింగ్ చేయడం కష్టమంటున్నాడు టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్. వీరిద్దరి కోసం ముందుగా వేసుకునే వ్యూహాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు భజ్జీ.
"క్రిస్ గేల్‌తో పోల్చుకుంటే వార్నర్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అతను బ్యాక్ ఫుట్, స్వీప్ షాట్లు వంటివి అవలీలగా ఆడగలడు. గేల్‌కు ఎవరైనా బంతులను వేగంగా వేస్తే కచ్చితంగా సిక్సర్ కొడతాడు. ఒకవేళ స్లో డెలివరీ వేస్తే అది అతడికి సౌకర్యవంతంగా ఉండదు. అందువల్ల గేల్‌కు బౌలింగ్ వేయడం నాకు కష్టమనిపించలేదు. ఎందుకంటే గేల్‌ను చాలాసార్లు పవర్‌ప్లేలోనే ఔట్ చేశాను. స్వీప్ షాట్లతో, మిడ్ ఆన్ మీదుగా ఎలాంటి బౌండరీలు కొట్టలేడు".
- హర్భజన్ సింగ్, చెన్నై సూపర్‌కింగ్స్ స్పిన్నర్
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భజ్జీ తనకు నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నాడు. ఆన్లైన్ ఇంటర్వ్యూ, లైవ్ సెషన్లతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. ఈ ఆటగాడు ప్రస్తుతం 'ఫ్రెండ్షిప్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదీ చూడండి... క్రికెటర్‌కు కరోనా సోకితే ప్రత్యామ్నాయం ఏంటి?