ETV Bharat / sports

'ఓపెనర్​గా పృథ్వీ కాదు శుభ్​మన్​కే నా ఓటు' - శుభమన్ గిల్ గురించి హర్భజన్ సింగ్

న్యూజిలాండ్​తో జరిగే టెస్టు సిరీస్​లో ఓపెనర్​గా శుభ్​మన్​ గిల్​కు అవకాశం ఇవ్వాలని సూచించాడు హర్భజన్ సింగ్. మయాంక్ అగర్వాల్, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే బాగుంటుందని తెలిపాడు.

హర్భజన్
హర్భజన్
author img

By

Published : Feb 13, 2020, 6:42 AM IST

Updated : Mar 1, 2020, 4:06 AM IST

ఇటీవల ఇండియా-ఏ తరఫున ఓ డబుల్ సెంచరీతో పాటు సెంచరీ చేసి సత్తాచాటిన శుభ్​మన్​ గిల్​కు టెస్టు అరంగేట్రం చేసే సమయం వచ్చిందని అన్నాడు హర్భజన్ సింగ్. న్యూజిలాండ్​తో 21న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​లో గిల్​ను ఓపెనర్​గా బరిలోకి దించాలని సూచించాడు. 16 నెలల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న పృథ్వీ షా కూడా ఓపెనర్​గా పోటీలో ఉన్నాడు. దీనిపై స్పందించాడు భజ్జీ.

"మొదటి​ టెస్టులో శుభ్​మన్​ను ఆడించాలి. ఇప్పటివరకు ఒక్క టెస్టు ఆడకపోయినా అతడిని ఓపెనర్​గా బరిలో దించడం మంచిదే. మూడు వన్డేల్లో విఫలమైనంత మాత్రాన మయాంక్ అగర్వాల్ ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ఈ సిరీస్​లో మయాంక్, శుభమన్​ ఓపెనింగ్ చేస్తారని భావిస్తున్నా."

-హర్భజన్ సింగ్, టీమిండియా వెటరన్ క్రికెటర్

ఇటీవల న్యూజిలాండ్​-ఏ తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్​లో అద్భుత ప్రదర్శన చేశాడు శుభ్​మన్ గిల్. మొదటి టెస్టులో 83, 204* పరుగులతో సత్తాచాటిన గిల్​.. రెండో టెస్టులోనూ సెంచరీ చేశాడు.

న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​ ఈనెల 21న ప్రారంభంకానుంది. గాయం కారణంగా ఈ సిరీస్​కు రోహిత్ శర్మ దూరం కాగా.. రాహుల్​కు మొండిచేయి చూపారు సెలక్టర్లు. ఫలితంగా మయాంక్ అగర్వాల్​తో ఓపెనింగ్ ఎవరు చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకోసం పృథ్వీ షాతో పాటు శుభ్​మన్ పోటీపడుతున్నాడు.

Last Updated : Mar 1, 2020, 4:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.