టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ హనుమ విహారి మరోసారి వార్తల్లో నిలిచాడు. తనపై విమర్శలు చేసిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు హుందాగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్‌గా మారింది.
-
*Hanuma Vihari
— Hanuma vihari (@Hanumavihari) January 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">*Hanuma Vihari
— Hanuma vihari (@Hanumavihari) January 13, 2021*Hanuma Vihari
— Hanuma vihari (@Hanumavihari) January 13, 2021
అసలేం జరిగిందంటే?
సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో విహారి.. 161 బంతుల్లో 23 పరుగులు చేసి మ్యాచు డ్రా కావడంలో కీలకంగా వ్యవహరించాడు. గాయపడినా సరే వెనుదిరగకుండా అలానే ఆడాడు. తొలి 109 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గాయపడినా అతడు ప్రదర్శించిన తెగువకు క్రికెట్ ప్రపంచమంతా సలాం కొడుతుంటే.. భాజాపా ఎంపీ బాబుల్ సుప్రియో మాత్రం విహారి ఇన్నింగ్స్‌ను విమర్శించారు. '109 బంతుల్లో కేవలం 7 పరుగులు చేస్తాడా.. 'హనుమ బిహారి' వల్లే టీమ్ఇండియా చారిత్రక విజయాన్ని సాధించలేకపోయింది. విజయం కోసం ప్రయత్నించకపోవడం నేరమే. క్రికెట్‌ను చంపేశావు' అంటూ ట్వీట్ చేశారు.
దీనికి విహారి చేసిన రీట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సుప్రియో విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా సింపుల్‌గా తన పేరు తప్పు రాశారని చెబుతూ 'హనుమ విహారి' అని బదులిచ్చాడు. 'ట్వీట్ ఆఫ్ ది డికేడ్', 'ఎపిక్', 'మంచి సమాధానం ఇచ్చావ్' అంటూ నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.
ఇదీచూడండి: పంత్, విహారిని సూపర్ హీరోస్ అనాల్సిందే!