2019-20 రంజీ సీజన్‌ను హైదరాబాద్ జట్టు ఓటమితో ప్రారంభించింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ చివరి రోజైన గురువారం.. ప్రియాంక్ పాంచల్ (90), భార్గవ్ మిరాయ్ (69నాటౌట్) రాణించడం వల్ల 187 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 239/6తో చివరిరోజు బరిలోకి దిగిన హైదరాబాద్.. 27పరుగులు మాత్రమే జోడించి 266 పరుగులకు ఆలౌటైంది. 187 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్ పటేల్ (1) త్వరగానే ఔటైనా ప్రియాంక్ పాంచల్ అదరగొట్టాడు. భార్గవ్‌తో కలిసి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టును విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
మరో మ్యాచ్‌లో స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్.. 8 వికెట్లతో సత్తాచాటడం వల్ల, తమిళనాడుపై కర్ణాటక 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.