క్రికెటర్ షమీ అహ్మద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని ఆమె భార్య హసీన్ జహాన్ స్వాగతించింది. షమీపై నిన్న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అతని భార్య హసీన్ జహన్ దాఖలు చేసిన గృహహింస పిటిషన్‌పై విచారణ చేసిన బంగాల్ అలీపోర్ కోర్టు... షమితో పాటు ఆయన సోదరుడు హసీద్ అహ్మద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది.
" న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు. ఏడాది కాలంగా న్యాయం కోసం వేచిచూస్తున్నా. ఎట్టకేలకు కోర్టు మంచి నిర్ణయం వెల్లడించింది".
-- హసీన్ జహన్, షమి భార్య
షమీ ప్రవర్తనపైనా విమర్శలు గుప్పించింది హసీన్. తనో పెద్ద క్రికెటర్‌లా ఫీలవుతాడని ఎద్దేవా చేసింది.
"అతడు చాలా బలవంతుడు అనే విధంగా షమీ మితిమీరి ప్రవర్తిస్తాడు. తానో పెద్ద క్రికెటర్‌లా ఫీలవుతాడు. నేను బంగాల్‌కు చెందిన అమ్మాయిని కాకపోయి ఉంటే.. నేను ఇక్కడ క్షేమంగా ఉండేదాన్ని కాదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నప్పుడు అమ్రోహ పోలీసులు నన్నూ, నా కూతుర్ని వేధింపులకు గురిచేశారు. దేవుని దయవల్ల అక్కడ నుంచి క్షేమంగా బయటపడ్డాం ".
-- హసీన్ జహాన్, షమీ భార్య
షమీ, హసీన్లకు 2014లో వివాహం జరిగింది. 2018 మార్చిలో అతనిపై వరకట్నం వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు చేసింది హసీన్. విడాకులు కోరుతూ నెలకు రూ.7 లక్షలు భరణంగా ఇవ్వాలని జహాన్ డిమాండ్ చేసింది. అయితే కోర్టు ఆమె అభ్యర్థనను స్వీకరించి వాళ్ల కూతురుకు నెలకు రూ.80 వేలు ఇవ్వాలని ఇదివరకే ఆదేశించింది.
ఇదీ చదవండి...ఫ్యాన్స్ డ్యాన్స్... రోహిత్ దిల్ఖుష్..!