ఐసీసీ ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీ ఎంపికకు తాము మద్దతు ఇస్తామని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. శశాంక్ మనోహర్ వారసుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టాలని సీఎస్‌ఏ కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఐసీసీ అధ్యక్షుడిగా మనోహర్ పదవీ కాలం వచ్చే నెల ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పదవీ కాలం మరో రెండు నెలల పొడిగించాలని అనుకుంటున్నారు.
![Graeme Smith backs Sourav Ganguly to be next ICC chief](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/graeme-smith_2105newsroom_1590070476_650.jpg)
మనోహర్ వారసుడిగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్ పేరు ఇప్పటి వరకు వినిపించింది. అయితే స్మిత్ వ్యాఖ్యలతో ఐసీసీ ఛైర్మన్ రేసు ఆసక్తికరంగా మారింది. "మా కోణం ప్రకారం ఐసీసీ ఛైర్మన్ పదవికి గంగూలీ సరైన వ్యక్తి. ఆటకు కూడా మంచిది. ఆధునిక క్రికెట్‌కు మేలు జరుగుతుంది. గంగూలీ అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడాడు. గౌరవప్రదమైన వ్యక్తి. అతడి నాయకత్వం ఎంతో అవసరం" అని స్మిత్ చెప్పాడు. సీఎస్‌ఏ తాత్కాలిక సీఈఓ జాక్వెస్ ఫాల్.. గంగూలీ పట్ల సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి.. నాటి మెరుపులు: లక్షణ పోరాటం, భజ్జీ మాయాజాలం