టీమ్ఇండియాతో టెస్టు సిరీస్ కోసం చెన్నై చేరిన ఇంగ్లాండ్ ఆటగాళ్లకు స్వాగతం పలికారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. 'మా సొంత నగరానికి స్వాగతం,' అంటూ ట్వీట్ చేశారు.
-
Welcome to my hometown @englandcricket wish was there for the game, should be a great series https://t.co/BNRDOQnnyO
— Sundar Pichai (@sundarpichai) January 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Welcome to my hometown @englandcricket wish was there for the game, should be a great series https://t.co/BNRDOQnnyO
— Sundar Pichai (@sundarpichai) January 27, 2021Welcome to my hometown @englandcricket wish was there for the game, should be a great series https://t.co/BNRDOQnnyO
— Sundar Pichai (@sundarpichai) January 27, 2021
"ఇంగ్లాండ్ జట్టు సభ్యులకు మా సొంత నగరానికి స్వాగతం. భారత పర్యటనకు శుభాభినందనలు. ఇదొక గొప్ప సిరీస్ కావాలని కోరుకుంటున్నా," అని సుందర్ ట్వీట్ చేశారు.
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయి.. తమిళనాడులోని చెన్నైలో జన్మించారు.
భారత పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలోనే జరగనున్నాయి.
ఇదీ చూడండి: 'భారత్‌ను దెబ్బతీయడం ఇంగ్లాండ్‌కు కష్టమే.. కానీ'