ఐపీఎల్, ప్రపంచకప్ టోర్నీలతో దాదాపు మూడు నెలల పాటు క్రికెట్ ప్రియులు పండగ చేసుకున్నారు. మెగాటోర్నీ ముగిసినా అదే ఆసక్తిని కొనసాగించేందుకు ఐసీసీ వినూత్నంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను తీసుకొచ్చింది. సుదీర్ఘ మ్యాచ్‌ల్లో ఈ సరికొత్త నిర్ణయం ఎలాంటి మార్పులు తీసుకొస్తుందన్న ప్రశ్నకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ స్పందించాడు. టెస్టు క్రికెట్ కూడా అభిమానులకు మజాను ఇస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే అందుకు మంచి పిచ్‌లు మరిన్ని తయారుచేయాలని సూచించాడు.
"టెస్టులకు అనుకూలించే పిచ్‌ల్లో మ్యాచ్‌లు ఆడితే ఆట ఆసక్తికరంగా ఉంటుంది. పిచ్‌లు బాగుంటేనే క్రికెట్ బోర్ కొట్టదు. ఉత్కంఠ గొలిపే మలుపులు, మంచి బౌలింగ్ స్పెల్స్, అద్భుతమైన బ్యాటింగ్‌తో వీక్షకులను ఆకట్టుకోవచ్చు. ప్రజలు అప్పుడే ఎక్కువగా టెస్టుపై దృష్టిపెడతారు"
-సచిన్ తెందూల్కర్
యాషెస్ సిరీస్ ఉత్కంఠగా సాగుతూ ఆకట్టుకుంటోందని... గత వారం లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్ మధ్య మంచి పోటీ నెలకొందని తెలిపాడు మాస్టర్.
"దురదృష్టవశాత్తు రెండో టెస్టులో స్మిత్‌కు గాయమై మ్యాచ్‌కు దూరమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లతో అతడికి సవాల్ విసిరి.. మ్యాచ్‌ను థ్రిల్లింగ్‌గా మార్చాడు. స్మిత్ ఔటవ్వకుండా ఉంటే ప్రేక్షకులు మరింత ఆసక్తిగా మ్యాచ్ తిలకించేవాళ్లు"
-సచిన్ తెందూల్కర్
ప్రపంచకప్ గురించి ఫైనల్ జరిగిన నాలుగు, ఐదు వారాల తర్వాత అందరూ మర్చిపోయారని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు.
"ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ ముగిసి నాలుగు వారాలే అయింది. అయితే మెగాటోర్నీ గురించి ప్రస్తుతం ఎవరూ మాట్లాడుకోవట్లేదు. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌పైనే అందరి చూపు ఉంది".
-సచిన్ తెందూల్కర్
ముంబయిలో ఐడీబీఐ నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో పాల్గొన్న మాస్టర్ బ్లాస్టర్.... టెస్టు క్రికెట్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. 200 టెస్టుల్లో సచిన్ 15వేల 921 పరుగులు చేశాడు.
-
A healthy country is a happy country. Mumbaikars have taken the mission of #SportPlayingNation forward by turning up in large numbers. The energy at @IDBIFed @MumbaiHM was exhilarating and it felt like being inside a stadium again!
— Sachin Tendulkar (@sachin_rt) August 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Keep it up, and #KeepMovingMumbai pic.twitter.com/xGUOiSCyVf
">A healthy country is a happy country. Mumbaikars have taken the mission of #SportPlayingNation forward by turning up in large numbers. The energy at @IDBIFed @MumbaiHM was exhilarating and it felt like being inside a stadium again!
— Sachin Tendulkar (@sachin_rt) August 25, 2019
Keep it up, and #KeepMovingMumbai pic.twitter.com/xGUOiSCyVfA healthy country is a happy country. Mumbaikars have taken the mission of #SportPlayingNation forward by turning up in large numbers. The energy at @IDBIFed @MumbaiHM was exhilarating and it felt like being inside a stadium again!
— Sachin Tendulkar (@sachin_rt) August 25, 2019
Keep it up, and #KeepMovingMumbai pic.twitter.com/xGUOiSCyVf
ప్రస్తుతం ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య యాషెస్ జరుగుతోంది. ఈ సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్రస్తుతం ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగానే రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతోంది.
ఇదీ చదవండి: ప్రపంచ ఛాంపియన్ అయ్యేదెవరు..?