స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్సీ ఇచ్చే విషయమై మాజీ క్రికెటర్ ఆడమ్స్ గిల్‌క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్య బాధ్యతలు అందుకునేందుకు అతడిపై ఉన్న ఆంక్షలు తొలగించాలని అన్నాడు. స్మిత్ ఉప సారథిగా చేయాలని బోర్డుకు సూచించాడు.
"స్టీవ్ స్మిత్‌కు మరోసారి జట్టు బాధ్యతలు ఎందుకు ఇవ్వకూడదు. ఆ పదవిని చేపట్టేందుకు అతడు సరైనవాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకూ స్మిత్‌పై ఇలాంటి భావనే ఉంటే అతన్ని వెంటనే వైస్ కెప్టెన్‌ను చేయండి"
-ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
2018లో బాల్ టాంపరింగ్ వివాదం వల్ల స్మిత్, వార్నర్ ఏడాది పాటు ఆటకు దూరమయ్యారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచీ వైదొలిగారు. ఆ తర్వాత నుంచి టెస్టులకు టిమ్ పైన్, వైట్ బాల్ మ్యాచ్‌లకు ఫించ్ సారథులుగా ఉన్నారు.
ఇదీ చదవండి:ప్రభాస్‌తో నటించాలని ఆశ పడుతున్న శ్రుతి