ETV Bharat / sports

క్రికెట్​లో ఈ పోస్ట్ వెరీ స్పెషల్! అంపైర్‌ అవ్వాలంటే ఏం చేయాలి? జీతం ఎంత ఉంటుందో తెలుసా? - Cricket Umpires Qualification - CRICKET UMPIRES QUALIFICATION

Cricket Umpires Qualification And Salary Details : చాలా మంది క్రికెటర్‌ కావాలని ఆశపడుతారు. కానీ అందరికీ అవకాశం రాకపోవచ్చు. ఇలాంటి వారికి క్రికెట్‌లో చాలా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అంపైర్‌గా స్థిరపడి మంచి ఆదాయం అందుకోవచ్చు. అంపైర్‌ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?

Etv BharaCricket Umpires Qualification
Cricket Umpires Qualification (AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 3, 2024, 7:09 PM IST

Cricket Umpires Qualification And Salary Details : మన దేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు క్రికెట్‌ ఆడటానికి, చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. వీరిలో ఎక్కువ మంది క్రికెటర్‌ కావాలని కలలు కంటుంటారు. క్రికెట్‌లో కెరీర్‌ కోరుకునే వారికి ప్లేయర్‌గా మాత్రమే కాకుండా ఇతర ఆప్షన్లు చాలానే ఉన్నాయి.

మీకు ప్లేయర్‌గా అవకాశాలు రాకపోతే క్రికెట్‌లో అంపైర్‌గా స్థిరపడవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అంపైర్ల ఇన్‌కమ్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంతకీ అంపైర్‌ కావాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

అంపైర్లు ఏం చేస్తారు?
క్రికెట్‌లో అంపైర్ల పాత్ర చాలా కీలకం. మ్యాచ్‌ సక్రమంగా జరిగేలా, ఆటగాళ్లందరూ రూల్స్‌ పాటించేలా చూస్తారు. మ్యాచ్ సమయంలో అంపైర్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి డెసిషన్‌ అంతిమంగా ఉంటుంది. క్రికెట్‌లో రెండు రకాల అంపైర్లు ఉంటారు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ సమయంలో మైదానంలో నిల్చుని నిర్ణయాలు తీసుకుంటారు. థర్డ్ అంపైర్ కఠినంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడానికి వీడియో టెక్నాలజీని ఉపయోగిస్తాడు. టీమ్‌లు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ల నిర్ణయాన్ని సవాలు చేస్తూ, రివ్యూ కోరినప్పుడు థర్డ్‌ అంపైర్‌ కీలకం. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సాయంతో బాల్‌ని ట్రాక్‌ చేసి, వీడియోలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాడు.

అంపైర్‌ అవ్వాలంటే ఏ స్కిల్స్‌ అవసరం?
అంపైర్ కావడానికి, క్రికెట్‌ ఆడిన అనుభవం అవసరం లేదు. మీరు ఆటను బాగా అర్థం చేసుకోవాలి. క్విక్‌ డెసిషన్‌ మేకింగ్‌, మంచి కమ్యూనికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్‌ (అంపైర్లు ఎక్కువ గంటలు నిలబడతారు కాబట్టి) అవసరం. మ్యాచ్ సమయంలో అన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించేందుకు కంటి చూపు బావుండాలి.

భారత్​లో క్రికెట్ అంపైర్‌ అవ్వడం ఎలా?

  • ముందుగా మీ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌లో చేరండి
  • బీసీసీఐ అంపైర్ అకాడమీలో చేరేందుకు మీ అసోసియేషన్ మీకు తప్పనిసరిగా స్పాన్సర్ చేయాలి.
  • అనంతరం బీసీసీఐ అంపైర్ అకాడమీలో సర్టిఫికేషన్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
  • అనుభం పొందడానికి రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లకు పని చేయండి.
  • 2-3 సంవత్సరాల అనుభవం తర్వాత, లెవల్ 1 ఎగ్జామ్‌కి అప్లై చేసుకోండి.
  • అలానే మెడికల్ టెస్ట్‌లు క్లియర్ చేసిన తర్వాత ఫైనల్ సర్టిఫికేషన్‌ పొందుతారు. చివరికి సర్టిఫైడ్‌ అంపైర్‌ అవుతారు.
  • బీసీసీఐ సిఫార్సుతో, మీరు అంతర్జాతీయ అంపైర్ కావచ్చు.

అంపైర్ జీతం ఎంత?
అంతర్జాతీయ అంపైర్లు : పనిచేసే మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా సంవత్సరానికి రూ.66 లక్షల నుంచి రూ.1.67 కోట్ల వరకు సంపాదిస్తారు. ఉదాహరణకు అంపైర్లు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు దాదాపు రూ.3.33 లక్షలు, వన్డేలకు రూ.2.26 లక్షలు, టీ20 మ్యాచ్‌లకు రూ.1.25 లక్షలు సంపాదిస్తారు.

డొమెస్టిక్‌ అంపైర్లు : డొమెస్టిక్‌ మ్యాచ్‌లలో, బీసీసీఐ అంపైర్‌లకు వారి గ్రేడ్ ఆధారంగా జీతాలు ఉంటాయి. టాప్-గ్రేడ్ అంపైర్లు రోజుకు దాదాపు రూ.40,000 సంపాదిస్తారు. ఇతరులు రోజుకు దాదాపు రూ.30,000 అందుకుంటారు.

భారత కామెంటేటర్‌లకే ఎక్కువ ఇన్‌కమ్‌! ఒక్క మ్యాచ్​కు ఎంత సంపాదిస్తారంటే? - Cricket Commentators Salary

దులీప్‌ ట్రోఫీ ప్లేయర్‌ల ఆదాయమెంత?- బీసీసీఐ ఎంత చెల్లిస్తుందంటే? - Duleep Trophy Players Salary

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.