Telangana Govt Amma Kosam Scheme For pregnant Women : గర్భిణుల కోసం తెలంగాణ సర్కార్ 'అమ్మకోసం' అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణీల్లో ప్రధానంగా తలెత్తే రక్తహీనతతో పాటు రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలను అరికట్టేందుకు ముందుస్తుగా వారు తీసుకునే జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జిల్లాల్లో రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఎంత మంది ఉన్నారు? ఆ సమస్యను అరికట్టె చర్యలు? వాళ్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అసలు సమస్య రాకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పలు అంశాలపై ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తున్నారు.
అవగాహన కల్పిస్తూ : మహిళ గర్భం దాల్చిన మూడో నెల నుంచి వైద్య సేవలు అందిస్తారు. ప్రతి నెల గర్భిణి ఆరోగ్య పరిస్థితి, పిండం ఎదుగుదలను వైద్యులు పరిశీలిస్తారు. ఎక్కువ ప్రమాదకర స్థాయి పరిస్థితిలో గర్భిణికి ఎలాంటి వైద్యం అందించాలి, ఎక్కడికి తీసుకెళ్లాలన్న అంశాలపై ఏఎన్ఎంలకు అవగాహన కల్పిస్తారు. ప్రతినెల వైద్య పరీక్షలు నిర్వహించి వాటిని పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే వెంటనే నివారణ కోసం వైద్యులను సంప్రదిస్తారు. గర్భిణులు మధుమేహం బాధితులుంటే అది బిడ్డకు సోకకుండా వైద్యుల సూచనతో మందులు అందించడం, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో అవగాహన కల్పిస్తారు.
క్విజ్ పోటీలు నిర్వహించి : అమ్మకోసం యాప్ ద్వారా రోజూ ఏఎన్‌ఎంలకు చరవాణిలో దృశ్య, శ్రవణం ద్వారా గర్భిణులకు అందించే వైద్య సేవలపై వివరంగా చెప్తారు. ప్రధానంగా గర్భిణుల్లో వచ్చే రక్తహీనతను సకాలంలో గుర్తించి ముందే నివారణ చర్యలు తీసుకుంటే కాన్పు సమయంలో ఎదురయ్యే ఎక్కువ ప్రమాదస్థాయి (హైరిస్క్)ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది గనుక ఆ సమస్య రాకుండా, ఒకవేళ వస్తే తీసుకునే చర్యలపై అవగాహన కల్పిస్తారు. మరోవైపు వారు నేర్చుకున్న అంశాల పట్ల వారి సామర్థాన్ని పరీక్షించేందుకు ఆన్లైన్లో క్విజ్ పోటీలు నిర్వహిస్తాన్నారు.
"మహిళలు గర్భం దాల్చిన చాలా మందికి రక్తహీనత ఉంటుంది. గర్భిణుల్లో రక్తహీనతను ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటే ప్రవస సమయంలో ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడానికి అవకాశముంటుంది. ప్రమాదకర పరిస్థితులుంటే మాతా శిశు సంరక్షణ కేంద్రాలకు తీసుకెళ్లి వైద్య సేవలందిస్తాం. ప్రతి మూడు నెలలకు వైద్య పరీక్షలు నిర్వహించి పిండం ఎదుగుదల, ఆరోగ్య సమస్యలుంటే గుర్తించే నివారణ చర్యలు తీసుకుంటాం." - డి.ఝాన్సీ, జిల్లా మాతాశిశు సంరక్షణ కార్యక్రమ అధికారిణి
గర్భవతులు బొప్పాయి, పైనాపిల్ తినొచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? - Can pregnant women eat papaya
Medicine During Pregnancy : సొంత వైద్యం వద్దు.. మందుల విషయంలో జాగ్రత్త.. గర్భిణీలకు నిపుణుల సలహాలు!