ETV Bharat / sports

'కరోనా వైరస్​ కంటే ప్రమాదకారివి నువ్వు'

వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​ రామ్​నరేశ్​ శర్వాణ్​పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపాడు ఆ దేశ బ్యాట్స్​మన్​ క్రిస్ ​గేల్​. కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​లోని జమైకా తలావాస్ నుంచి తనను తొలగించడానికి కారణం అతనేనని స్పష్టం చేశాడు.

author img

By

Published : May 16, 2020, 2:34 PM IST

Gayle "stands by his comments" against Sarwan
'కరోనా వైరస్​ కంటే ప్రమాదకారివి నువ్వు'

వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​ రామ్​నరేశ్​ శర్వాణ్​పై గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు విధ్వంసకర బ్యాట్స్​మన్​ క్రిస్​ గేల్​. కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​(సీపీఎల్​)లోని జమైకా తలావాస్​ జట్టు నుంచి తనను తొలగించడానికి ఆ జట్టుకు కోచ్​గా వ్యవహరించిన రామ్​నరేశ్​ కారణమని ధ్వజమెత్తాడు.

"నువ్వు ఒక పాము లాంటివాడివి శర్వాణ్​. ప్రతీకారం తీర్చుకునేందుకు విషం చిమ్ముతున్నావు. నమ్మినవారిని వెన్నుపోటు పొడవడానికీ వెనుకాడవు. కరోనా వైరస్​ కంటే పెద్ద ప్రమాదకారివి" అంటూ రామ్​నరేశ్​ శర్వాణ్​ను ఉద్దేశించి క్రిస్​ గేల్​ గతంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం అదే విషయాన్ని మళ్లీ ప్రస్తావిస్తూ ఓ వీడియోను పోస్ట్​ చేశాడు గేల్​.

"జమైకా తలావాస్​ జట్టు అభిమానులకు ఓ విషయాన్ని వివరించడానికే నేను ఈ వీడియో పోస్ట్​ చేస్తున్నాను. రామ్​నరేశ్​పై విమర్శలు చేయడం నా ఉద్దేశం కాదు. గతంలో నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. జమైకా తలావాస్​లో నా కెరీర్​ అద్భుతంగా సాగింది. ఎందుకంటే నా మనుషుల మధ్య ఆడటం నేను మర్చిపోలేను. సీపీఎల్​లో నాకు వచ్చింది అవకాశంగానే భావిస్తానే తప్ప దానిపై పెత్తనం చెలాయించాలని మాత్రం అనుకోలేదు" అని గేల్ స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి.. బంగ్లా క్రికెటర్​ బ్యాట్​ను వేలంలో కొన్న అఫ్రిదీ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.