ఆగస్టు 3 నుంచి టీమిండియా.. వెస్టిండీస్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ 20 జట్టు ప్రకటించిన విండీస్ తాజాగా వన్డే జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్‌లో క్రిస్ గేల్‌కు అవకాశం కల్పించింది కరీబియన్ బోర్డు. 14 మంది సభ్యులలో ఈ విధ్వంసకర ఓపెనర్‌ను తీసుకుంది.
భారత్‌తో జరగనున్న ఈ వన్డే సిరీస్‌తో రిటైర్ కానున్నట్టు గేల్ ఇంతకుముందే ప్రకటించాడు. వన్డేల్లో 10వేల 393 పరుగులు చేసిన క్రిస్ గేల్ మరో 13 పరుగులు చేస్తే లారా (10వేల 405) రికార్డును అధిగమిస్తాడు. ఇప్పటివరకు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన విండీస్ ఆటగాడిగా లారా ఘనతకెక్కాడు.
"క్రిస్ గేల్ విలువైన, అనుభవం గల ఆటగాడు. క్రికెట్ వ్యూహాలకు సంబంధించి డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టుకు అతడి అవసరముంది" - ఫ్లయడ్ రీఫర్, విండీస్ కోచ్.
వెస్టిండీస్ వన్డే జట్టు ఇదే..
జేసన్ హోల్డర్ (కెప్టెన్), జాన్ క్యాంప్‌బెల్, ఎవిన్ లూయిస్, హిట్మైర్, నికొలస్ పూరన్, రొస్టన్ చేజ్స ఫాబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్‌వైట్, కీమో పాల్, క్రిస్ గేల్, షెల్డాన్ కాట్రెల్, థామస్, షాయ్ హోప్, కీమర్ రోచ్.
గేల్‌తోపాటు ఎడమ చేతివాటం ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ చేజ్ ఆల్‌రౌండర్ కీమో పాల్‌ను జట్టులో తీసుకుంది. ఆగస్టు 8న గయనా నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఆగస్టు 11, 14న జరిగే రెండు మ్యాచ్‌లకు ట్రినిడాడ్‌లో క్వీన్స్ పార్క్ ఓవల్ వేదిక కానుంది.
ఇది చదవండి: టీమిండియాతో తలపడే విండీస్ టీ20 జట్టిదే