ఒలింపిక్స్‌లో క్రికెట్లో చేర్చాలనే విషయమై విధ్వంసక క్రిస్ గేల్ మాట్లాడాడు. టీ10 ఫార్మాట్‌ను అందులో చేర్చితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. త్వరలో ప్రారంభమయ్యే అబుదాబి టీ10 లీగ్‌లో ఆడనున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో పాల్గొంటున్నాడు గేల్.
"ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకోవాలి కానీ నా మైండ్‌లో మాత్రం అబుదాబి టీ10 లీగ్ గురించి ఆలోచిస్తున్నాను. కొద్దిరోజుల్లో ప్రాక్టీసు మొదలుపెట్టి, మైదానంలో అడుగుపెడతాను. టీమ్ అబుదాబితో పాటు సహచర ఆటగాళ్లతో కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. అలానే టీ10 క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలనుకుంటున్నాను" -క్రిస్ గేల్, వెస్టిండీస్ క్రికెటర్
విండీస్ జట్టు తరఫున ఆడుతున్న గేల్.. పలు దేశాల లీగ్‌ల్లోనూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో ప్రస్తుతం పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇది చదవండి: 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్..!: ఐసీసీ ప్రయత్నాలు