ETV Bharat / sports

త్వరలో ఐపీఎల్ వేలం.. ఫ్రాంచైజీలకు సూచన - ఫ్రాంచైజీలకు ఆఖరు తేదీ

ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విధానాన్ని జనవరి 20లోగా ఫ్రాంచైజీలు పూర్తి చేయాలని గవర్నింగ్ కౌన్సిల్​ తెలిపింది. ఐపీఎల్​ వేలంలో పాల్గొనాలనే కొత్త ఆటగాళ్లు ఫిబ్రవరి 4లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.

IPL winners of 2020
'ఐపీఎల్​ 14: జవవరి 20లోగా రిటెన్షన్​ పద్ధతి ముగియాలి'
author img

By

Published : Jan 15, 2021, 8:24 PM IST

ఐపీఎల్​ 14 మెగా లీగ్​ కోసం సన్నాహాలు జరుపుతోంది బీసీసీఐ పాలక మండలి. ఈ మేరకు ఫ్రాంచైజీలు... ఆటగాళ్లను అట్టిపెట్టుకునే పద్ధతిని జనవరి 20లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఫ్రాంచైజీల్లో భాగమవని భారత ఆటగాళ్లు తమ ఆసక్తి మేరకు వేలం అగ్రిమెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, ఫిబ్రవరి 4 లోగా పూర్తి చేయాలని తెలిపింది.

ఈ దరఖాస్తు ఒరిజినల్ పత్రాలను ఫిబ్రవరి 12లోపు కౌన్సిల్​కు చేర్చాలని పాలక మండలి పేర్కొంది. పూర్తి వివరాలను బీసీసీఐ మధ్యంతర సీఈఓ, ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ సీఓఓ హేమంగ్ అమిన్ వివరించారు. ఇప్పటికే ఫ్రాంచైజీలతో కాంట్రాక్ట్​లో ఉన్న ఆటగాళ్లకు ఇది వర్తించదని పేర్కొన్నారు. రాష్ట్ర క్రికెట్​ కౌన్సిల్స్​కు, బీసీసీఐకి దీనితో సంబంధం లేనట్లు తెలిపారు.

మనదేశ అండర్-19 క్రికెటర్లు, త్వరలో జరగబోయే ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనాలనుకుటే ముందుగా రాష్ట్ర అసోసియేషన్​లో ఆటగాడిగా ఉండాలని అమిన్ సూచించారు. అలానే ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​ లేదా క్లాస్​ ఏ క్రికెట్​లో ఒక్క మ్యాచ్​ అయినా ఆడి ఉండాలనే నిబంధన ఉన్నట్లు మరోసారి గుర్తు చేశారు. రిటైర్​ అయిన దేశవాళీ ఆటగాళ్లు బీసీసీఐ అనుమతితో ఐపీఎల్​లో ఆడే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:ఐపీఎల్: ఆటగాళ్ల రిటెన్షన్​కు ఆఖరు తేదీ ఇదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.