ETV Bharat / sports

'సింగిల్స్‌కు నిరాకరించే రోజులు దగ్గరపడ్డాయి'‌ - ఎంఐటీ వర్చువల్ మీటింగ్

క్రికెట్లో డేటా ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపాడు భారత మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్​. ఆటగాళ్ల ఎంపికకు, ఆటలో వ్యూహలు తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఎంఐటీ క్రికెట్ గణాంకాలపై జరిగిన వర్చువల్ మీటింగ్​లో అతడు పాల్గొన్నాడు.

Former Indian cricketer Rahul Dravid has said that data plays a major role in cricket.
'సింగిల్స్‌కు నిరాకరించే రోజులు దగ్గరపడ్డాయి'‌
author img

By

Published : Apr 9, 2021, 12:55 PM IST

క్రికెట్లో ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలో 'డేటా' ఎంతగానో ఉపయోగపడుతుందని టీమ్‌ఇండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. ఆటలో పోటీని పెంచేందుకు ఇది ఊతమిస్తోందని వెల్లడించారు. 'బేస్‌బాల్‌ మాదిరిగానే క్రికెట్‌కు సైతం గణాంకాలే ఆధారం. పదిహేనేళ్లలో మనం ఒక్క సగటును కాకుండా ఇతర విషయాలను కూడా పోల్చి చూస్తున్నాం. వ్యూహరచన, ఆటగాళ్ల ఎంపికకు డేటా సాయపడుతోంది' అని ఎంఐటీ క్రీడా విశ్లేషణ సదస్సులో ద్రవిడ్‌ పేర్కొన్నారు. ఎంఐటీలో క్రికెట్‌ గణాంకాలపై ఇలాంటి సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి.

టీమ్‌ఇండియా మాజీ కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌.. ఇంగ్లాండ్‌ మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి, ఇషా గుహ సైతం సదస్సులో పాల్గొన్నారు. ఆటగాళ్లు సాధన చేసేందుకు, ఫిట్‌గా ఉండేందుకు, బౌండరీలు, సిక్సర్లు బాదేందుకు ఇంకా మరెన్నో అంశాల్లో డేటా ఎలా ఉపయోగపడుతుందో చర్చించారు. బాస్కెట్‌ బాల్‌లోని '3 పాయింట్‌ రెవల్యూషన్' తరహాలోనే క్రికెట్లో డేటా ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో అత్యధిక క్యాచ్​ల ఆటగాళ్లు వీరే

'సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవు! ఎందుకంటే ప్రతి రెండు, మూడు బంతులకో సిక్సర్‌ బాదే పరిస్థితులు వచ్చేశాయి. క్రికెట్లో బ్యాటు, బంతికి నడుమ పోటీని డేటా నడిపించనుంది' అని ద్రవిడ్‌ అన్నారు. టీ20ల్లో ప్రతి బంతికీ ప్రాముఖ్యం ఏర్పడిందని, కొత్త కుర్రాళ్లు మెరుగైన సాంకేతికత కారణంగా ప్రత్యర్థి ఆటగాళ్ల బలాబలాలను విశ్లేషించుకొని ప్రతిదాడి చేస్తున్నారని ఇషా గుహ తెలిపారు. మ్యాచ్‌కు సన్నద్ధమయ్యేందుకు జట్లు డేటా ఆధారంగా ప్రయోజనం పొందుతున్నాయని పేర్కొన్నారు. క్రీడల్లో సందిగ్ధం నెలకొనప్పుడు డేటా ఎలా ఉపయోగపడుతోందో కిర్‌స్టెన్‌ వివరించారు.

ఇదీ చదవండి: 'కొవిడ్​ వల్ల కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.