ETV Bharat / sports

'పంత్, కిషన్​.. కోహ్లీని చూసి నేర్చుకోండి' - విరాట్ కోహ్లీ

భారత యువ బ్యాట్స్​మెన్ రిషభ్ పంత్, ఇషాన్ కిషన్​కు పలు సూచనలు చేశాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. సారథి కోహ్లీని చూసి చాలా నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. తమదైన రోజున చివరి వరకు క్రీజులో ఉండి జట్టు విజయానికి తోడ్పడాలని తెలిపాడు.

Former India opener Virender Sehwag has made several suggestions to young Indian batsmen Rishabh Pant and Ishant Kishan.
'ఆ విషయంలో పంత్, కిషన్​.. కోహ్లీని చూసి నేర్చుకోవాలి'
author img

By

Published : Mar 16, 2021, 4:02 PM IST

టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మెన్ రిషభ్‌పంత్‌, ఇషాన్‌ కిషన్‌.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని చూసి ఒక విషయం నేర్చుకోవాలని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సూచించాడు. మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో ఉండాలని.. తమదైన రోజు ఔటవ్వకుండా బ్యాటింగ్‌ చేయాలని.. జట్టును విజయతీరాలకు చేర్చాలని సలహా ఇచ్చాడు.

"తనదైన రోజు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తప్పకుండా జట్టును గెలిపిస్తాడు. ఫార్మాట్‌ ఏదైనా చివరి వరకు క్రీజులో ఉండి విజయం సాధిస్తాడు. అతడి బ్యాటింగ్‌లో అదో ప్రత్యేకత. ఈ విషయంలో పంత్‌, కిషన్‌.. కోహ్లీని చూసి నేర్చుకోవాలి. మీదైన రోజు ఔటవ్వకుండా ఆడాలి. చివరివరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాలి. నాకు కూడా సచిన్‌ ఇదే విషయం చెప్పేవాడు. 'ఈ రోజు నువ్వు బాగా ఆడుతున్నావని తెలిస్తే.. వీలైనంతసేపు క్రీజులో పాతుకుపో. చివరి వరకు పరుగులు చేస్తూ నాటౌట్‌గా మిగిలిపో. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. పరుగులు చేస్తావో లేదో చెప్పలేం. కానీ, నువ్వు బాగా ఆడే రోజు పరిస్థితి ఎలా ఉందనే విషయం అర్థమవుతుంది. దాంతో ఆ రోజు ఔటవ్వకుండా ఆడి పరుగులు సాధించాలి‌' అని సచిన్‌ నాతో అనేవాడు" అని వీరూ గుర్తు చేసుకున్నాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అరంగేట్రం బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌కిషన్‌ (56;32 బంతుల్లో 5x4, 4x6), కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు. అర్ధశతకం తర్వాత మరింత దూకుడుగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఆపై పంత్‌(26; 13 బంతుల్లో 2x4, 2x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అప్పటికే టీమ్‌ఇండియా విజయం ఖరారు కాగా, భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. మరోవైపు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన చేసిన ఇషాన్‌ కిషన్‌ను మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్ ప్రశంసించాడు. అతడు దేశవాళీ క్రికెట్‌లో ఝార్ఖండ్‌ తరఫున ఆడుతుండటం వల్ల కిషన్​ను మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో పోల్చాడు.

ఇదీ చదవండి: మార్చి 16: ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరపురాని రోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.