ETV Bharat / sports

'పాక్​ క్రికెట్​ బోర్డులో ఒక్కరికీ ఓనమాలు తెలియవు..' - imran khan, miandad news

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ) పనితీరును ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ జావెద్​ మియాందాద్​. బోర్డులో ఒక్కరికీ ఆట గురించిన ఓనమాలు తెలియవని ఆయన ఆరోపించాడు.

pak cricketer miandad news
'పాక్​ క్రికెట్​ బోర్డులో ఒక్కరికీ ఓనమాలు తెలియవు..'
author img

By

Published : Aug 12, 2020, 10:35 PM IST

పాక్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి, ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ వల్లే దేశంలో క్రికెట్‌ నాశనమైందని మాజీ క్రికెటర్ జావెద్‌ మియాందాద్‌ ఆరోపించాడు. పాక్‌ క్రికెట్‌ బోర్డులో ఉన్న అధికారులకు ఆటలో ఓనమాలు తెలియవని విమర్శించాడు. ఆటగాళ్లకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మియాందాద్‌ మాట్లాడాడు.

pak cricketer miandad news
ఇమ్రాన్‌ఖాన్, మియాందాద్​

"పీసీబీలోని ఒక్క అధికారికీ క్రికెట్‌లో ఓనమాలు తెలియవు. ప్రస్తుత బాధాకర పరిస్థితుల గురించి ఇమ్రాన్‌తో నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. దేశానికి సరికాని వాళ్లను వదిలిపెట్టను. విదేశాల నుంచి ఓ వ్యక్తి (వసీమ్‌ ఖాన్‌)ని తీసుకొచ్చారు. దోచుకొని పారిపోతే అతడిని మీరు పట్టుకోగలరా? పాక్‌లో ఎంతోమంది ఉండగా అతడే కావాల్సి వచ్చాడా? దేశ పౌరులు ఎదగాలి. నిజంగా మెరుగైన వ్యక్తులు లభించకపోతేనే బయటకు చూడాలి. కానీ అలా జరగడం లేదు" అని మియాందాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

డిపార్ట్‌మెంటల్‌ క్రికెట్‌ను రద్దుచేయడం వల్ల యువ క్రికెటర్లకు ఉపాధి లభించడం లేదని మియాందాద్‌ అన్నాడు. దేశ భవిష్యత్తు వారేనని స్పష్టం చేశాడు. మున్ముందు వారు దేశానికి ఆడొద్దని తాను కోరుకోనన్నాడు. డిపార్ట్‌మెంటల్‌ క్రికెట్‌ను కొనసాగించాలని తాను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

పీసీబీ ఎలా నడుస్తుందో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పట్టించుకోవడం లేదని విమర్శించాడు. "నేను నీ కెప్టెన్‌ను. మరోలా అనుకోవద్దు. నిన్ను నేను ప్రోత్సహించాను. క్రికెట్‌ గురించి నీ కన్నా ఎవరికీ బాగా తెలియదు. నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆలస్యం కాకముందే పీసీబీని చక్కదిద్దాలి" అని మియాందాద్‌ సూచించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.