ETV Bharat / sports

రిటైర్మెంట్​ తర్వాత పార్థివ్​కు ఆర్సీబీ గిఫ్ట్​! - ఆర్సీబీ న్యూస్

రానున్న ఐపీఎల్​ సీజన్​ కోసం ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను అంటిపెట్టుకుని.. మిగిలిన ఆటగాళ్లను వేలానికి వదిలేశాయి. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ పార్థివ్​ పటేల్​ను విడిచిపెడుతున్నట్లు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీనిపై పార్థివ్​ సరదాగా స్పందించాడు.

Formar Cricketer Parthiv Patel cheeky comment on rcb releasing him after retirement
రిటైర్మెంట్​ తర్వాత పార్థివ్​కు ఆర్సీబీ గిఫ్ట్​!
author img

By

Published : Jan 22, 2021, 6:28 AM IST

ఐపీఎల్‌ 2021 కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) తనను తొలగించడంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ సరదాగా స్పందించాడు. ఏప్రిల్‌, మేలో నిర్వహించే టీ20 లీగ్‌ 14వ సీజన్‌లో ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలో, ఎవరెవరిని వదిలించుకోవాలో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని జట్లూ తమకు కావాలసిన, అవసరం లేని ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. అందరిలాగే ఆర్సీబీ తమ జాబితాను ప్రకటించగా అందులో మొత్తం 10 మంది పేర్లు ఉన్నాయి.

అయితే, ఆ వదిలించుకున్న వారి జాబితాలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌పటేల్‌ పేరూ ఉంది. గత డిసెంబర్‌లోనే అన్ని ఫార్మాట్లకు పార్థివ్​ వీడ్కోలు పలికాడు. దీంతో తాను రిటైర్‌ అయ్యాక ఆర్సీబీ తగిన విధంగా సత్కరించిందని పేర్కొంటూ కొంటెగా ట్వీట్‌ చేస్తూ ఆ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం పక్కనపెడితే, పార్థివ్‌ మాటల్లో కాస్తంత బాధ కూడా ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే మూడేళ్ల క్రితం ఈ జట్టులో చేరిన అతడు ఇటీవల యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. 2018-19 సీజన్లలో 6, 14 మ్యాచ్‌లాడి 153, 373 పరుగులు చేశాడు. కానీ, గత సీజన్‌లో ఆర్సీబీ పార్థివ్‌కు అవకాశమే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై పరోక్ష వ్యాఖ్యలు చేశాడని అభిమానులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: 'నువ్వు లేని ఐపీఎల్​ మునుపటిలా ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.