17 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి వన్డేలో భారత్‌పై 374 పరుగుల భారీ స్కోరు చేసిన ఆసీస్.. 17 ఏళ్ల రికార్డును చెరిపేసింది. మెన్ ఇన్ బ్లూపై ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు 2003 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాపై 359/2 చేసింది ఆస్ట్రేలియా.
ఫించ్ రెండోవాడు..
ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో 5000 పరుగుల మార్క్‌ను వేగంగా అందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు ఫించ్. 126 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇతడి కంటే ముందు వార్నర్ (115 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.
ఆ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్ స్మిత్..
ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు స్మిత్. 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. ఇతడి కంటే ముందు మ్యాక్స్‌వెల్(51 బంతుల్లో) ఉన్నాడు.
హార్దిక్ అత్యధిక స్కోరు
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. ఈ మ్యాచ్‌లోనే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటివరకు వన్డేల్లో అతడికిదే (90) అత్యధిక స్కోరు.
కోహ్లీ మళ్లీ విఫలం..
సిడ్నీ మైదానంలో పేలవ రికార్డు ఉన్న కోహ్లీ.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలోనూ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 21 పరుగులే చేసి వెనుదిరిగాడు. అంతకు ముందు ఇదే మైదానంలో 21(27), 3*(9), 1(13), 8(11), 3(8) పరుగులు మాత్రమే చేశాడు.
చాహల్ చెత్త రికార్డు..
స్పిన్నర్ చాహల్.. వన్డేల్లో తన పేరిటే ఉన్న చెత్త రికార్డును అధిగమించాడు. ఓ ఇన్నింగ్స్‌లో ఎక్కువ స్కోరు సమర్పించుకున్న మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసి 89 పరుగులు ఇచ్చాడు.
సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 67 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఓటమి పాలైంది. విజయంలో ఫించ్(114), స్మిత్(105) సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. దీంతో వన్డే సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇదీ చూడండి :దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి