పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా తొలిసారి ఓ మహిళా నియామకమైంది. కొత్తగా ఏర్పాటైన నలుగురు పీసీబీ డైరెక్టర్లలో హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్‌గా అలియా జాఫర్‌ను బోర్డు ఎంపిక చేసింది. మిగిలిన వారిలో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ జావేద్ కురేషీ, ఆర్థికవేత్త అసిమ్ వాజిద్ జావాద్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరిఫ్ సయీద్‌లు ఉన్నారు. ఇందులో జాఫర్, జావాద్ల పదవీకాలం రెండేళ్లు.
నియామకాన్ని స్వాగతిస్తున్నాను
పీసీబీ కొత్త రాజ్యాంగం ప్రకారం నలుగురు స్వతంత్ర డైరెక్టర్లలో కనీసం ఓ మహిళను తన గవర్నింగ్ బోర్డులో నియమించడం తప్పనిసరి. కొత్తగా నియమించిన స్వతంత్ర డైరెక్టర్లలో మహిళా సభ్యురాలు ఎంఎస్ అలియా జాఫర్ ఎంపికను స్వాగతిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి తెలిపారు.