ETV Bharat / sports

'రెండు నెలలున్నా కోహ్లీ బలహీనతలు గుర్తించలేకపోయా' - వన్డేల్లో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు

టీమ్​ఇండియా సారథి కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా సారథి ఆరోన్​ ఫించ్​. 50 ఓవర్ల క్రికెట్​లో విరాట్ అత్యుత్తమ ఆటగాడని కితాబిచ్చాడు. ఆర్సీబీ జట్టుతో రెండు నెలలు ఉన్నా కోహ్లీలో బలహీనతలు కనిపెట్టలేకపోయినట్లు తెలిపాడు.

finch about kohli
వన్డేల్లో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు: ఫించ్​
author img

By

Published : Nov 26, 2020, 10:26 PM IST

భారత్​-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్​ ముంగిట కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు కంగారూ జట్టు సారథి ఆరోన్​ ఫించ్​. వన్డేల్లో కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. అతడి రికార్డులే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే వీరిద్దరూ ఆర్సీబీ జట్టు తరఫున బరిలోకి దిగారు.

finch
ఫించ్​-కోహ్లీ

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం సిడ్నీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఫించ్​.."కోహ్లీ రికార్డులను చూసి అతడు అత్యుత్తమం అని చెప్పొచ్చు. విరాట్​ను త్వరగా ఔట్​ చేయడంపైనే మేము దృష్టిసారించాలి" అని వెల్లడించాడు.

రెండు నెలలు ఉన్నా.. విరాట్​ బ్యాటింగ్​లో బలహీనతలను గుర్తించలేకపోయినట్లు చెప్పాడు ఆరోన్​ ఫించ్​. అదంత సులభం కూడా కాదని అభిప్రాయపడ్డాడు. ఆల్​టైమ్​ వన్డే క్రికెటర్లలో విరాట్​ ఒకడని పొగడ్తలు కురిపించాడు ఆస్ట్రేలియా సారథి.

ఐపీఎల్​లో ఫించ్​ మెరుగైన ప్రదర్శన చేయలేదు. 11 ఇన్నింగ్స్​ల్లో కేవలం ఒక అర్ధశతకం మాత్రమే చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.