ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పట్ల వివాదాస్పదమైన తన వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇచ్చాడు దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్. ట్విట్టర్ వేదికగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. వ్యక్తిగతంగా తనకు ఐపీఎల్ కంటే పాకిస్థాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్) ఎందుకు ఉత్తమమైన టోర్నీనో చెప్పుకొచ్చాడు.
"ఐపీఎల్ ఇప్పటికే అతిపెద్ద లీగ్‌గా కొనసాగుతోంది. అందులో చాలా మంది ఆటగాళ్లకి తుది జట్టులో స్థానం దొరకదు. అదే పీఎస్ఎల్ వంటి చిన్న చిన్న టోర్నీల్లో అయితే టీమ్‌లో స్థానం లభిస్తుంది. పైగా కెరీర్ చరమాంకంలో ఉన్న నా లాంటి క్రికెటర్లకు ఆడే అవకాశం చిన్న లీగ్‌ల్లో తప్పకుండా వస్తుంది."
-డేల్ స్టెయిన్, దక్షిణాఫ్రికా క్రికెటర్.
ప్రస్తుత 14వ సీజన్‌కు ఐపీఎల్లో ఏ జట్టు స్టెయిన్‌ను కొనుగోలు చేయలేదు. ఒకవేళ ఏ ఫ్రాంచైజీ అయినా తనను దక్కించుకున్నా.. ఆడాలన్నా ఆసక్తి మాత్రం తనకు లేదని స్పష్టం చేశాడు. గత సీజన్లో బెంగుళూరు జట్టుకు ఆడిన స్టెయిన్.. మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్‌పై స్టెయిన్: నిన్న విమర్శలు.. నేడు క్షమాపణలు