ETV Bharat / sports

బుమ్రా నోబాల్ నా కెరీర్​ను మార్చేసింది: జమాన్

భారత బౌలర్ బుమ్రా వేసిన ఓ నోబాల్ తన కెరీర్​నే మార్చిందని అంటున్నాడు పాక్ బ్యాట్స్​మెన్ ఫకర్ జమాన్. ప్రస్తుతం ప్రపంచకప్​లో రాణించడమే తన లక్ష్యమని తెలిపాడు.

ఫకర్
author img

By

Published : May 27, 2019, 5:02 PM IST

టీమిండియా పేసర్ బుమ్రా చేసిన తప్పిదం తన క్రికెట్ కెరీర్​కు కొత్త మలుపునిచ్చిందని తెలిపాడు పాకిస్థాన్ బ్యాట్స్​మెన్ ఫకర్ జమాన్. ఇంగ్లాండ్ వేదికగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బుమ్రా బౌలింగ్​లో ఔటయ్యాడు. అది కాస్త నోబాల్​గా తేలింది. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఫకర్ చెలరేగి ఆడాడు. కెరీర్​లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్​లో భారత్ ఓడిపోయింది. ఫకర్ జమాన్ 114 పరుగులు చేసి పాక్​ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆ విషయంపై తాజాగా ఫకర్‌ జమాన్‌ మాట్లాడాడు.

"బుమ్రా నోబాల్ నాకు కొత్త జీవితాన్నిచ్చింది. ఫైనల్‌కి ముందు నోబాల్‌‌‌కు ఔటవ్వాలనే కల ఉండేది. అనుకోకుండా అది నిజమైంది. భారత్‌పై మ్యాచ్‌లో బాగా ఆడతానని నా తల్లిదండ్రులకు మాటిచ్చాను. ఫైనల్లో మొదట ఔట్‌ కాగానే చాలా బాధనిపించింది. అయితే అది నో బాల్‌ అయినందున శతకం చేశాను. ఆ మ్యాచ్​ తర్వాత నేను బాగా ఫేమస్ అయిపోయాను. ఫేమ్​తో పాటు బాధ్యత కూడా పెరిగింది. గతంతో పోలిస్తే.. ఇప్పుడు పరిణతితో ఆడుతున్నా. ప్రపంచకప్​లో రాణించడమే తక్షణ కర్తవ్యం.
- ఫకర్ జమాన్, పాకిస్థాన్ బ్యాట్స్​మెన్

ఫకర్ మొదట నేవీలో ఉద్యోగం చేసేవాడు. క్రికెటర్​ కావాలన్న కలతో నేవీ తరఫున మ్యాచ్​లు ఆడాడు. అతడి బ్యాటింగ్​ నచ్చిన కోచ్ మికీ ఆర్థర్, సెలక్టర్ ఇంజిముల్​ హఖ్ జాతీయ జట్టులో అవకాశం కల్పించారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ 36 వన్డేలాడి 51.31 సగటుతో మంచి బ్యాట్స్​మెన్​గా పేరు సంపాదించాడు ఫకర్​ జమాన్​.

ఇవీ చూడండి.. 'టీమిండియాలో వరస్ట్​ డ్యాన్సర్ ఎవరంటే..?'

AP Video Delivery Log - 0900 GMT Horizons
Monday, 27 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0758: HZ US Nuclear Decommissioning AP Clients Only 4212504
Risks, rewards in speedier nuclear plant closures
AP-APTN-0758: HZ Kenya Silkworm Farming AP Clients Only 4212115
Farmers swap high risk crops for silk worms
AP-APTN-0758: HZ Bangladesh Ramadan National Mosque AP Clients Only 4212116
Thousands pray daily at the famous national mosque
AP-APTN-0757: HZ US Smart Hair Salon AP Clients Only 4210842
High-tech salon offers private pods, movies and Alexa
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.