ETV Bharat / sports

'2022 ఐపీఎల్​లోనూ ధోనీ ఆడతాడు' - IPL 2020 dhoni

ధోనీ ఫామ్​ గురించి తమకు భయం లేదని, 2022లోనూ ఐపీఎల్​ ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు చెన్నై జట్టు సీఈఓ విశ్వనాథన్. ఈ లీగ్ ప్రస్తుత సీజన్, సెప్టెంబరు 13 నుంచి యూఏఈ వేదికగా మొదలుకానుంది.

'2022 ఐపీఎల్​లోనూ ధోనీ ఆడతాడు'
ధోనీ
author img

By

Published : Aug 12, 2020, 2:26 PM IST

ఈ ఏడాదితో పాటు రానున్న రెండేళ్ల పాటు చెన్నైకి ధోనీ కెప్టెన్​గా ఉంటాడని సీఎస్క్​కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

MS Dhoni to be part of Chennai Super Kings in 2021 and 2022 IPL
చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

"అవును. ఐపీఎల్ 2020, 2021లో ధోనీ ఆడతాడు. 2022లోనూ జట్టులోనే ఉంటాడు. ధోనీ ప్రాక్టీసు చేస్తున్నాడని నాకు మీడియా ద్వారానే తెలిసింది. కెప్టెన్ ఫామ్ గురించి మాకు కంగారేమి లేదు.​ తన బాధ్యతలేంటో మహీకి తెలుసు" -కాశీ విశ్వనాథన్, చెన్నై జట్టు సీఈఓ

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. గతవారం స్వస్థలం రాంచీలోని ఇండోర్ అకాడమీ ప్రాక్టీసు చేశాడు. ఆగస్టు 16-20 మధ్య జరగబోయే శిక్షణా శిబిరంలో పాల్గొనున్నాడని సమాచారం.

MS Dhoni ipl stats
ధోనీ ఐపీఎల్ కెరీర్ గణాంకాలు

గతేడాది ప్రపంచకప్​లో చివరగా కనిపించిన ధోనీ.. ఆ తర్వాత ఐపీఎల్​లో ఆడి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు. మార్చిలో కరోనా రావడం, లీగ్​ నిరవధిక పడటం, టీ20 ప్రపంచకప్​ వాయిదా.. ఇలా చాలానే అనుకోని సంఘటనలు జరిగాయి. దీంతో మహీ కెరీర్ సందిగ్ధంలో పడింది.​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.