ETV Bharat / sports

సిడ్నీ టెస్టులో భారత్​దే పైచేయి: రోహిత్ కోచ్ - బోర్డర్​ గవాస్కర్​ ట్రోఫీ వార్తలు

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా పైచేయి సాధిస్తుందని రోహిత్ శర్మ కోచ్ దినేశ్​ లాడ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్​ రాకతో జట్టుకు మరింత బలం చేకూరిందని ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

EXCLUSIVE: Rohit should be wary of Mitchell Starc, says his coach Dinesh Lad
సిడ్నీ టెస్టులో భారత్​దే పైచేయి!: రోహిత్​శర్మ కోచ్​
author img

By

Published : Jan 4, 2021, 5:58 PM IST

Updated : Jan 4, 2021, 7:31 PM IST

రోహిత్​ శర్మ రాకతో టీమ్​ఇండియా మరింత బలంగా మారిందని హిట్​మ్యాన్​ కోచ్​ దినేశ్​ లాడ్​ అభిప్రాయపడ్డారు. భారత జట్టు ఇటీవల ప్రదర్శనను పరిశీలిస్తే.. సిడ్నీలో టీమ్ఇండియానే పైచేయి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్​.. తన బ్యాటింగ్ టెక్నిక్​ను వృద్ధి చేసుకున్నాడని, ఎలాంటి బౌలర్​నైనా ఎదుర్కొంటాడని వెల్లడించారు. అలాగే తాజాగా ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు రోహిత్​ కోచ్​ దినేశ్​ లాడ్.

ప్ర. మూడో టెస్టులో టీమ్​ఇండియాపై మీ అంచనా ఏమిటి?

దినేశ్​ లాడ్​: తొలిటెస్టులో పరాజయం తర్వాత తిరిగి పుంజుకుని రెండో మ్యాచ్​లో విజయం సాధించింది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో మూడో టెస్టుపై మరింత ఆసక్తి పెరిగింది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్​డే టెస్టులో అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఇప్పుడు రోహిత్​ రాకతో జట్టుకు మరింత బలం చేకూరనుంది. గాయం కారణంగా ఉమేశ్ సిరీస్​ నుంచి వైదొలగినా.. సైనీ, శార్దూల్​ టీమ్​కు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.

ప్ర. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులో టీమ్​ఇండియా టాప్​ఆర్డర్ విఫలమైంది. పృథ్వీషా, మయాంక్​ అగర్వాల్​లు బ్యాటింగ్​లో ఇబ్బందిపడుతున్నా.. శుభ్​మన్​ గిల్​ క్రమంగా రాణిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ రోహిత్​ ఏ స్థానంలో బ్యాటింగ్​ చేసే అవకాశం ఉంది?

దినేశ్​ లాడ్​: నాకు తెలిసి రోహిత్​ శర్మ ఓపెనర్​గా రావొచ్చు. టీమ్​ఇండియా యాజమాన్యం అదే విధంగా ఆలోచిస్తుందని భావిస్తున్నా. ఓపెనర్​గా దక్షిణాఫ్రికా సిరీస్​లో రాణించాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఆడిన అనేక మ్యాచ్​ల్లో అద్భుతంగా బ్యాటింగ్​ చేశాడు. అందుకే ఓపెనర్​గా రోహిత్​ను పంపి.. అతడికి భాగస్వామిగా శుభ్​మన్​ గిల్​ను ఎంపిక చేయొచ్చు. నాకు తెలిసి మయాంక్ స్థానంలో రోహిత్​ను జట్టులోకి తీసుకుంటారని ఆశిస్తున్నా.

ప్ర. లెఫ్టార్మ్ బౌలర్లతో రోహిత్​ ఆటతీరును గమనిస్తే.. ప్రస్తుత సిరీస్​లో మిచెల్ స్టార్క్​ వంటి ఆటగాళ్లను రోహిత్​ ఏ విధంగా ఎదుర్కొంటాడు?

దినేశ్​ లాడ్​: మొదట్లో తాను ఆన్​సైడ్​ ఆడాలనే ఆలోచనతో చాలా ఇబ్బందిగా బ్యాటింగ్​ చేసేవాడు. కానీ, ప్రస్తుతం లెఫ్టార్మ్​ బౌలింగ్​లోనూ మామూలుగా ఆడుతున్నాడు. గతంలో లాంటి ఇబ్బందులు ఇప్పుడు రోహిత్​కు లేవని భావిస్తున్నా.

ప్ర. రోహిత్​ శర్మ విదేశాల్లో బ్యాటింగ్​ చేయలేక పోతున్నాడని.. అతని కెరీర్​లో ఎక్కువ రన్స్​ స్వదేశంలోనే చేశాడని విమర్శకులు అంటున్నారు. దానికి మీ సమాధానం?

దినేశ్​ లాడ్​: విదేశాల్లో రోహిత్ వన్డే ప్రదర్శనను గమనిస్తే అద్భుతంగా ఆడాడని అర్థం అవుతుంది. బంతి ఏ విధంగా వస్తుందనే దాన్ని ముందే పసిగట్టి స్పందించడం రోహిత్​ లక్షణం. బ్యాటింగ్​లో రోహిత్​ కష్టపడుతున్నాడని నేను అనుకోవడం లేదు. ఆసీస్​తో మ్యాచ్​లో కచ్చితంగా రాణిస్తాడని భావిస్తున్నా.

ప్ర. రోహిత్​ ఓ క్లాస్​ బ్యాట్స్​మన్​ అని ఆస్ట్రేలియన్​ స్పిన్నర్​ నాథన్​ లియోన్​ అన్నాడు. రోహిత్​.. టెస్టుల్లోనూ మంచి యావరేజ్​ను నమోదు చేస్తూ వస్తున్నాడు. ఆసీస్​తో జరిగే మ్యాచ్​ల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందా?

దినేశ్​ లాడ్​: రోహిత్​ శర్మ ఓ సానుకూల బ్యాట్స్​మన్​. అతని ఆటతీరు గమనిస్తే ఆరంభంలో పరుగులు చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటాడు. ప్రతి బంతిని షాట్​ కొట్టాలని భావించడు. ఆ తర్వాత బంతి వచ్చే అనుకరణ బట్టి బ్యాటింగ్​ చేస్తాడు.

ప్ర. ఎలాంటి బంతికి, బౌలర్​కు రోహిత్​ శర్మ జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు?

దినేశ్​ లాడ్​: ప్రతి బంతికి రోహిత్​ ఏకాగ్రతతో ఉండాలి. మిచెల్​ స్టార్క్​ బౌలింగ్​లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.

ప్ర. ఆస్ట్రేలియా జట్టుపై మీ శిష్యులు రోహిత్​శర్మ, శార్దూల్​ ఠాకూర్​ ఆడడం కోచ్​గా మీరు గర్వపడుతున్నారా?

దినేశ్​ లాడ్​: కోచ్​గా నేను చాలా గర్వపడుతున్నా. నా విద్యార్థులు టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది.

ఇదీ చూడండి: నాలుగో టెస్టు రద్దా? అదేం లేదే!

Last Updated : Jan 4, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.