ETV Bharat / sports

ఐపీఎల్​​​ సన్నాహాలపై కుల్దీప్ చెప్పిన విశేషాలు - kkr ipl news updates

త్వరలో ఐపీఎల్​ ఆడనున్న స్పిన్నర్ కుల్దీప్.. లీగ్​ సన్నాహాల గురించి ఆసక్తిర విషయాలు చెప్పాడు. ఈటీవీ భారత్​తో జరిగిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించాడు.

Kuldeep Yadav
ఐపీఎల్​ స్పెషల్
author img

By

Published : Aug 23, 2020, 6:04 AM IST

టీమ్​ఇండియా స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతడు క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే యూఏఈకి కూడా చేరుకున్నాడు. అక్కడికి వెళ్లకముందు ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, 2020 ఐపీఎల్​ విశేషాలతో పాటు, లాక్​డౌన్​ అనుభవాలు, భవిష్యత్​ ప్రణాళికల గురించి పంచుకున్నాడు.

ఈటీవీ భారత్​తో కుల్దీప్ యాదవ్​​ ఇటర్వ్యూ

కరోనా లాక్​డౌన్​తో నెలల తరబడి ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత తిరిగి మైదానంలో అడుగు పెట్టబోతున్నారన్న భావన ఎలా అనిపిస్తోంది?

ఆ పరిస్థితులు అందరికీ కష్టంగానే తోచాయి. అప్పుడు చాలా మంది సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫిట్​నెస్​ పరంగా బాగానే ఉన్నానని అనుకుంటున్నా. అవుట్​డోర్​ శిక్షణ పూర్తిగా నిలిచిపోవడం వల్ల పట్టు కోల్పోయాను. ఇంట్లోనే వ్యాయామం చేయాల్సి వచ్చింది. ఈ లాక్​డౌన్​ వల్ల బౌలింగ్​ను బాగా మిస్​ అయ్యా.

లాక్‌డౌన్‌లో మీ ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకున్నారు?

నా కోచ్​ ఒకసారి ఆహారపు అలవాట్లను నియంత్రించమని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే డైటింగ్​ను అనుసరించాలని సూచించాడు. ఈ లాక్​డౌన్​ మొత్తం ఫిట్​నెస్​పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించా. రోజూ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేశా. నా శరీరాకృతిపై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయమని భావించా. ఇప్పుడు నా ఫిట్​నెస్​ విషయంలో సంతోషంగా ఉన్నా.

ఐపీఎల్ 13 సన్నాహాలు ఎలా జరుగుతున్నాయి?

మార్చి నుంచి ఇప్పటివరకు ఇంగ్లాండ్​, పాకిస్థాన్​, వెస్టిండీస్ మినహా.. ఎవరూ క్రికెట్​ ఆడలేదు. చాలా మంది ఆటగాళ్లు క్రికెట్​కు దూరంగా ఉన్నారు. అందరి గురించి నాకు తెలియదు కానీ.. ఈ ఐపీఎల్​ నాకు బాగా కలిసొస్తుందని నమ్ముతున్నా.

గతే సీజన్​ మీకు అంతగా కలిసి రాలేదు కదా.. అది మీపై మరింత ఒత్తిడి పెంచుతుందని అనుకుంటున్నారా?

అలాంటిదేమీ లేదు. అది ఆటపై ఆధారపడి ఉంటుంది. క్రికెటర్ల కెరీర్​లో గెలుపు ఓటములు సహజం. ప్రపంచంలో ఎప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన క్రికెట్​ ఒక్కరు కూడా లేరు. గతేడాది నాకు గట్టి సవాలుగా మారింది. కానీ ఈ సారి సీజన్​లో మంచిగా రాణిస్తాననే నమ్మకం ఉంది.

గత ఐపీఎల్​లో మొయిన్​ ఆలీకి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అతడ్ని లక్ష్యంగా చేసుకోనున్నారా?

ఏ ఒక్క ఆటగాడినో లక్ష్యంగా చేసుకుని నేను ఆడను. క్రికెట్​లో ప్రతి ఒక్కరికీ ఓ రోజు వస్తుంది. ఎవరైనా సెంచరీలు సాధించగలరు. ఎవ్వరినీ నేను టార్గెట్​ చేయను. కానీ, ధోనీ, కోహ్లీ, ఎబి డివిలియర్స్​ లాంటి పెద్ద ఆటగాళ్లను మాత్రం లక్ష్యంగా చేసుకుంటాను. తద్వారా అనుభవం పరంగా నాకు మరింత ప్రయోజనం కలుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.